Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Meena Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Meena Rasi-Ugadi Rasi Phalalu 2023: ఫాస్ట్‌ఫుడ్‌ సహా ఈ వ్యాపారాలు బెటర్‌! మీతో పెట్టుకున్న వాళ్లకు చుక్కలే

Published Mon, Mar 20 2023 1:44 PM

Yearly Rasi Phalalu Pisces Horoscope 2023 - Sakshi

మీన రాశి - (ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2)
మీనరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురు రాహువుల సంచారం, సప్తమ అష్టమస్థానాలలో కేతుగ్రహ సంచారం, వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అనేకమందితో నూతనమైన వ్యవహారాలు వ్యాపారాలు లాభిస్తాయి. ఆశపెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు.

ఎంతోమందికి మీరు అభయహస్తం ఇస్తారు. కొంతమంది విద్యాభ్యాసం కోసం స్వార్జితాన్ని విరాళంగా అందజేస్తారు. వ్యాపార వ్యవహారాలు ఊహకు మించి పెరుగుతాయి. ప్రతి పనికి అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. లాటరీలు, క్రికెట్‌ బెట్టింగ్‌లు పనికిరావు. దొంగ స్వామీజీల వల్ల, నకిలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

ఈ వ్యాపారాలు బెటర్‌
ఫర్నిచర్‌ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం, బేకరీలు, హాస్టల్‌ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలకు మంచిపేరు వస్తుంది. నూతన పదవీప్రాప్తి వుంది. గృహయోగం, వాహనయోగం కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.

అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో ఉద్యోగప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఆహార, అలంకార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. లాయర్లకు, పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేస్తారు.

సంతానం లేనివారికి సంతానప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణ చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు).

మీతో వైరం పెట్టుకుంటే
శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తారు. విమర్శలను పట్టించుకోకుండా నడుచుకుంటారు. మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలిసివస్తుంది. లోహపు వ్యాపారులకు, ఆహారధాన్యాల వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. పన్నుల అధికారుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది.

గడప గౌరమ్మ వాడేటప్పుడు ఇందులో సుమంగళీ పసుపు కలిపి ఉపయోగించండి. ఆకస్మికంగా ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. ఉద్యోగపరంగా మీపై కక్ష సాధించాలనుకునే మీ పైఅధికారికి స్థానచలనం కలగడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇతరుల బరువు, బాధ్యతలను మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో చికాకులు ఎదురవుతాయి.

సంతానం చదువుల నిమిత్తం అధిక ధనం వెచ్చించవలసిన పరిస్థితి రావచ్చు. ప్రతిరోజూ హనుమాన్‌ సింధూర్‌ నుదుటన ధరించండి. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌కు ఈ సంవత్సరము బాగుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం.

పార్శ్వపు నొప్పి, ఈఎన్‌టీ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్స్‌ ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు. మరి కొంతమంది సన్నిహితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది.

స్త్రీలకు ప్రత్యేకం:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతవరకు అనుకూలంగా వుంటుంది. ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా అవార్డులు స్వీకరిస్తారు. అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. క్రీడారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు ప్రక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా బయటపడతారు. రహస్య సమాలోచనలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి.

మార్షల్‌ ఆర్ట్స్‌ పట్ల ఆకర్షితులు అవుతారు. మొండికి పడిన శుభకార్యాలు ఓ దారికి వస్తాయి. బాధ్యతలు నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యమిస్తారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. ఆత్మీయులతో విడిపోవడం కన్నా, కలిసి వుండటం మంచిదని గ్రహించండి. వ్యాపారం మీ అంచనాలను మించి ఎదుగుతుంది. లాభాలు బాగుంటాయి.

విద్యాసంబంధమైన విషయాలు, విదేశీయాన యత్నాలు సానుకూలపడతాయి. ఐఐటీ, మెడిసిన్, సాంకేతిక రంగం, సివిల్‌ సర్వీస్‌లు, గ్రూప్‌ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిషం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక సంతృప్తి ఉండదు. సంతాన పురోగతి సంతృప్తికరంగా వుంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. గైనిక్‌ సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిట్టీల వల్ల, ఫైనాన్స్‌ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కళా, సాహిత్య రంగాలలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపికవుతారు. స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. గతాన్ని మరచి మాట్లాడడం వలన విమర్శలకు గురవుతారు. భార్యాభర్తల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటుంది (ఇది కొంతమంది విషయంలో మాత్రమే).

ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన పదవి సంతోషం కలిగించదు. పిల్లల చదువుల కోసం అధికంగా ఖర్చుచేస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యాల వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి. అలంకార వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. మరో గృహయోగం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు.

మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయడం అనవసరమని భావిస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎగ్జిక్యూటిల్‌ పోస్టుల్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులో ఉన్నవారికి, జ్యూడిషియల్‌ ఆఫీసర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ విషయాలు అంతగా పట్టించుకోలేరు. ఆత్మీయుల ముసుగులో ఉన్న వ్యక్తుల నిజస్వరూపం ఆలస్యంగా తెలుసుకుంటారు.

మీపై వచ్చిన నిందారోపణలు నిజం కాదని నిరూపించుకో గలుగుతారు. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబానికి బరువు కాకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి.

సంతాన పురోగతి గురించి ఆందోళన చెందవలసి వస్తుంది. తల్లిదండ్రులు, బంధువుల పెద్దలతో విభేదాలు వచ్చే పరిస్థితులు సంభవం. ఆకస్మికంగా శుభకార్యాలు నిశ్చయమవుతాయి. స్వీయ సంపాదనతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కండరాలు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యం బాధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది.

yearly horoscope 2023

Advertisement
 
Advertisement
 
Advertisement