పుతిన్‌ పైశాచికత్వం.. ఉక్రెయిన్‌లో 51 మంది మృతి.. | Sakshi
Sakshi News home page

పుతిన్‌ పైశాచికత్వం.. ఉక్రెయిన్‌లో 51 మంది మృతి..

Published Thu, Oct 5 2023 9:04 PM

Ukrainian Say 51 People Killed Russian Missile Hit Kharkiv - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం దాడులు.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా రాకెట్‌లో ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. రాకెట్‌ దాడిలో 51 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఉక్రెయిన్‌ దేశ అధికారులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెట్‌ దాడులు చేసింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్‌స్క్‌ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. ఈ రాకెట్‌ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్‌ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ రిజియన్‌లోని బెరిస్లావ్‌ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్‌ ఎమర్జెన్సీ స్టేషన​్‌పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కాగా, స్పెయిన్‌లో జరుగనున్న యూరప్‌ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్‌ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు

Advertisement
Advertisement