వేటగాళ్ల బైండోవర్‌ | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల బైండోవర్‌

Published Sat, Apr 20 2024 1:55 AM

- - Sakshi

పలిమెల: కామన్‌పల్లి గ్రామంలో అటవీ జంతువుల కోసం ఉచ్చులు, విద్యుత్‌ తీగలను అమర్చుతున్న ఆరుగురు వేటగాళ్లను గుర్తించి పలిమెల ఎస్సై తమాషారెడ్డి కౌన్సెలింగ్‌ నిర్వహించి రూ.లక్ష పూచీకత్తుపై తహసీల్దార్‌ హేమ ఎదుట శుక్రవారం బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తమాషారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటవీ సంరక్షణ కోసం విధి నిర్వహణలో అటవీ అధికారులు రాత్రింబవళ్లు అడవిలో తిరుగుతుంటారన్నారు. ఉచ్చులు, విద్యుత్‌ తీగలు అమర్చడం ద్వారా పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

యువత మత్తుకు

బానిస కావొద్దు

కాళేశ్వరం: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై భవానీసేన్‌ అన్నారు. కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. గంజాయి, మత్తుకు అలవాటు పడి జీవితాలు అంధకారం చేసుకోవద్దన్నారు. గంజాయి, మత్తుపదార్థాలకు అలవాటు పడివ వారి గురించి పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. యువత మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారి నడవడికను కనిపెడుతూ ఉండాలని చెప్పారు. మొబైల్స్‌ వాడకంతో యువత మంచికి కాకుండా చెడుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుందన్నారు. అలాంటి వారిని ఇంట్లో ఎప్పడికప్పుడు గమనించాలని చెప్పారు. వారివెంట పోలీసులు ఉన్నారు.

బాలుడిపై కుక్క దాడి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం మెట్‌పల్లిలో బాలునిపై కుక్క దాడి చేసింది. పిట్టల శ్రీనివాస్‌–రమ దంపుతుల కుమారుడు మనివిత్‌(4) శుక్రవారం రోడ్డుపై ఉండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో బాలుడి కంటి కింద తీవ్రంగా గాయమైంది. కాళేశ్వరంలోని ఆస్పత్రికి ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు క్షమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలో గుర్తింపుపొందిన ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, దివ్యాంగ, మైనారిటీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ విద్యతో పాటు ఎంసెట్‌ శిక్షణ అందించేందుకు కార్పొరేట్‌ కళాశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి అధికారిని సునీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ఈనెల 27వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలతో పాటు కళాశాల డాక్యుమెంట్‌ వివరాలను జతచేసి కలెక్టరేట్‌లోని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని కోరారు. వివరాలకు 99088 43340 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఎండ వేడికి చేపల మృతి

కాటారం: చెరువులో నీటి సమృద్ధి తక్కువ అవడం.. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. కాటారం మండలం చింతకాని ఊరుచెరువులో ఎండవేడికి శు క్రవారం వేలాది చేపలు చనిపోయాయి. చెరు వు ఆయకట్టులో రైతులు పంట పొలాలు సాగుచేయగా.. చెరువు నుంచి సాగునీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో చెరువులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎండలు అధికమవడంతో వేడికి చెరువులోని చేపలు శుక్రవారం పెద్దఎత్తున మృతిచెందాయి. చెరువులో ఉన్న అతి తక్కువ నీటిపై చేపలు చనిపోయి తేలియాడుతూ ఉండటం పలువురిని కలిచివేసింది.

1/3

2/3

3/3

Advertisement
Advertisement