చోరీ కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు

Published Fri, Apr 19 2024 2:40 AM

-

పిఠాపురం: నాలుగు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ పిఠాపురం ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సుధారాణి గురువారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2021వ సంవత్సరంలో పిఠాపురం పట్టణంలో వరుస దొంగతనాలు జరిగాయి. పిఠాపురం పట్టణంలో సీతయ్యగారితోట, వైఎస్సార్‌ గార్డెన్స్‌, లయన్స్‌క్లబ్‌ ఏరియా, పట్టణంలో ఒక లాడ్జి, భీమ్‌నగర్‌ వంటి తొమ్మిది చోట్ల వరుస చోరీలు జరిగాయి. దీనిపై నలుగురు బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై బి.శంకరరావు నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుల్లో పెద్దాపురం మండలం ఉలిమేశ్వరానికి చెందిన యండపల్లి సూరిబాబును నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో సూరిబాబుకు ప్రతి కేసులోను ఒక ఏడాది చొప్పున నాలుగు కేసుల్లోను నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసుల్లో ఏపీపీ ఆకుల నాగ లీలా రోజా ప్రాసిక్యూషన్‌ నిర్వహించగా కోర్టు కానిస్టేబుల్‌ కరీమ్‌ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టారు.

Advertisement
Advertisement