నేడు విరూపాక్షి నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

నేడు విరూపాక్షి నామినేషన్‌

Published Tue, Apr 23 2024 8:10 AM

- - Sakshi

ఆలూరు: వైఎస్సార్‌సీపీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుసినె విరూపాక్షి మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడులైంది. నామినేషన్‌ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, జేసీఎస్‌ కోఆర్డినేటర్‌, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తెర్నేకల్లు సురేంద్రరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఉపాధ్యాయ నగర్‌ కాలనీలోని కొలువుదీరిన సాయిబాబు మందిరం నుంచి అంబేద్కర్‌సర్కిల్‌ మీదుగా ఏటీఎం వరకు ర్యాలీ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ న్యాయవాది లక్ష్మీకాంతం, ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్‌ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు.

పీజీ ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్‌ సప్లిమెంటరీ

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పీజీ కోర్సులు చదివి ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం స్పెషల్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ వెంకట సుందరానంద పుచ్చ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి మే 6వ తేదీ వరకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

క్వింటా కందులు రూ.11,569

వాము గరిష్ట ధర రూ.28,669

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందుల ధర రోజు, రోజుకు పెరుగుతోంది. సోమవారం మార్కెట్‌కు 61 మంది రైతులు 174 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.3,829, గరిష్ట ధర రూ.11,569 లభించింది. మోడల్‌ ధర రూ.11109 నమోదైంది. అంటే అత్యధిక లాట్లకు రూ.11వేలపైనే ధర లభించడం విశేషం. 2023–24లో వర్షాభావం వల్ల కందుల దిగుబడులు తగ్గినప్పటికీ గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది. వాము మార్కెట్‌కు 215 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.రూ.1,060, గరిష్ట ధర రూ.28,669, మోడల్‌ ధర రూ.17,082 లభించింది.

తగ్గని భగభగలు

మహానంది, గోస్పాడులో

45.3 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండలు, వడగాలుల తీవ్రత పెరిగిపోతుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు పాదచారుల దాహార్తి తీరుస్తున్నాయి. మహానంది, గోస్పాడులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనగానపల్లి, డోన్‌లలో 44.5, రుద్రవరంలో 44.3, నంద్యాల, కోడుమూరులో 44.1, ఆత్మకూరులో 44, మంత్రాలయంలో 43.6, కర్నూలులో 43.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

ఎన్నికల విధులకు

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు

కర్నూలు కల్చరల్‌: సాధారణ ఎన్నికల విధులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన ఆదేశాల మేరకు రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలోని డిగ్రీ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల వలంటీర్లను ఎంపిక చేసినట్లు వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.పి.నాగరాజు తెలిపారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి. సుఽధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు 980 మంది జాబితాను ఎన్నికల అధికారికు పంపామని తెలిపారు. వీరు వయోవృద్ధులు, దివ్యాంగులను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకురావడం, ఓటర్లు క్యూలైన్లలో ఉండేలా చూడటం లాంటి విధుల్లో సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు.

1/1

Advertisement
Advertisement