No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Apr 8 2024 8:15 AM

- - Sakshi

ఆరోగ్య దినోత్సవంపై అవగాహన ర్యాలీ

పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆర్యోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది యాదయ్య, వెంకటేశం, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ మెదక్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా రాజు

టేక్మాల్‌(మెదక్‌): బీజేపీ మెదక్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా టేక్మాల్‌కు చెందిన ఎల్లుపేట రాజుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ నియామక పత్రం అందజేశారు. ఇందులో టేక్మాల్‌ మండల అధ్యక్షుడు నవీన్‌కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సిద్ధిరాములు, ఉపాధ్యక్షుడు వడ్డె రాములు, యువ మోర్చా అధ్యక్షులు పవన్‌, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు సేనాపతి ఉన్నారు.

నిత్యాన్నదానానికి విరాళం

శివ్వంపేట(నర్సాపూర్‌): మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీ కుటుంబ సభ్యులు రూ.లక్ష 53 వేల 348 విరాళం అందజేశారు. ఆదివారం ఆంజనేయస్వామిని బీవీఆర్‌ఐటీ అధినేత విష్ణురాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ప్రభుశర్మ, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

యువకుడి అదృశ్యం

టేక్మాల్‌(మెదక్‌): యువకుడి అదృశ్యమైన ఘటన మండల కేంద్రం టేక్మాల్‌లో ఆదివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మురళీ తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్‌ గ్రామానికి చెందిన బాజ గణేశ్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 2న ఫొటోలు దింపే పని మీద వేరే గ్రామానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లాడు. రెండు రోజులు అనంతరం కుటుంబ సభ్యులు గణేశ్‌కు ఫోన్‌ చేస్తే స్వీచ్చాఫ్‌ వచ్చింది. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు గణేశ్‌ రెడ్‌ టీషర్ట్‌, బ్లూ కలర్‌ జీన్స్‌ పాయింట్‌ వేసుకున్నట్లు తెలిపారు. గణేశ్‌ తండ్రి కిష్టయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ జిల్లా ముదిరాజ్‌ మహాసభ ప్రధాన కార్యదర్శిగా నోముల శ్రీకాంత్‌ ముదిరాజ్‌ నియామక ఆదివారం నియమించారు. ఆదివారం తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య సమక్షంలో జిల్లా తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి అక్షయ్‌ కుమార్‌ నియామక పత్రాన్ని అందజేశారు. మూగ లక్ష్మయ్యముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త వార్తలు

1/3

2/3

3/3

Advertisement
Advertisement