ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్‌ | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్‌

Published Sun, May 12 2024 2:07 AM

First look of Ashwin Babu starrer Shivam Bhaje out

అశ్విన్‌బాబు హీరోగా అప్సర్‌ దర్శకత్వంలో మహేశ్వర్‌ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్‌ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్‌బాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్‌ డేట్‌ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్‌ బాడిస స్వరకర్త.

Advertisement
 
Advertisement
 
Advertisement