Sakshi News home page

Movie Collection: 'జపాన్', 'జిగర్ తాండ డబుల్ ఎక్స్'.. ఫస్ట్‌డే వసూళ్లు మరీ అలానా!

Published Sat, Nov 11 2023 6:52 PM

 Japan And Jigarthanda Double X Movie Day 1 Collection - Sakshi

ప్రతివారంలానే ఈసారి కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాకపోతే చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. అలా తాజాగా కార్తీ 'జపాన్'తో పాటు 'జిగర్ తాండ డబుల్ ఎక్స్' అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్‌’ మూవీ రివ్యూ)

'ఆవారా', 'యుగానికొక్కడు'. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ తాజాగా 'జపాన్' సినిమాతో వచ్చాడు. అయితే దొంగ-పోలీస్ కథతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైంది. రివ్యూలు అన్ని అలానే వచ్చాయి. దీంతో తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.కోటి మాత్రమే వచ్చిందట. తమిళంలో మాత్రం రూ.3.5 కోట్ల పైనే వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలా ఓవరాల్‌గా రూ.5 కోట్ల లోపే కలెక్షన్ వచ్చాయి. వీకెండ్ లో కాస్తోకూస్తో డబ్బులు వస్తాయి తప్పితే లాంగ్ రన్ లో నష్టాలు రావడం గ్యారంటీ!

ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన 'జిగర్‌తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా 'జపాన్'లానే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. లారెన్స్, ఎస్‌జే సూర్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ ల్యాగ్ ఉండటం సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలిరోజు మొత్తంగా రూ.1.75 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు తుస్సుమనిపించాయి.

(ఇదీ చదవండి: 'జిగర్‌ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?)

Advertisement

What’s your opinion

Advertisement