Manchu Lakshmi Interesting Comments On Manchu Manoj And Bhuma Mounika - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi Prasanna: నలుగుర్ని కనాలనుకున్నా.. కానీ ఆ దేవుడు..

Published Thu, Jul 6 2023 3:05 PM

Manchu Lakshmi Interesting Comments on Manoj and Bhuma Mounika - Sakshi

ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం పెద్ద టాస్కే! కానీ ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే తప్పకుండా విజయం వరించి తీరాల్సిందే! మంచు మనోజ్‌, భూమా మౌనికలు కూడా ప్రేమించుకున్నారు. దశాబ్దకాలానికి పైగా పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం.. ఇరు కుటుంబాలు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందా? లేదా? అని మొదట్లో అంతా టెన్షన్‌ పడ్డారు. అందరికంటే ఎక్కువగా టెన్షన్‌ పడింది తానేనంటోంది మంచు లక్ష్మి.

తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్‌ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్లినప్పుడు.. మనోజ్‌- మౌనికకు పెళ్లి చేయి దేవుడా.. నా వల్ల కావడం లేదు. మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. రెండు కుటుంబాలకు ఓ చరిత్ర ఉంది. మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న సందేహం వారికుంది. కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య? కుదిరితే ఆశీర్వదించాలి. ఎలాగోలా వారికి పెళ్లయింది. సంతోషంతో వాళ్లను యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఆయన నా మాట విన్నాడనిపించింది.

పెళ్లికి ముందు వరకు ఇద్దరూ నాతోపాటే ఉన్నారు. పెళ్లయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్‌ చేసి ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? అని మౌనిక అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్‌ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా? ఎలాగైనా చేసుకుపో అని టార్చర్‌ పెడుతున్నాను. కానీ తనకు చాలా ఓపిక ఉంటుంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు, నలుగుర్ని కనాలనుకున్నా.. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

చదవండి: నిహారిక, బిందుమాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మి కామెంట్స్‌

Advertisement
 
Advertisement
 
Advertisement