ఓటీటీలో 'ఓ మై గాడ్‌ 2' తెలుగు వర్షన్‌ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఓ మై గాడ్‌ 2' తెలుగు వర్షన్‌ వచ్చేసింది

Published Thu, Apr 25 2024 5:06 PM

OMG 2 Telugu Version Streaming Now OTT

బాలీవుడ్‌ హిట్‌ సినిమా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంతో బాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమాపై పలు అభ్యంత‌రాలు రావడంతో సుమారు 20కి పైగా సీన్లను సెన్సార్‌ వారు కట్‌ చేశారు.

గడ ఏడాది ఆగష్టులో విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ ఇప్పటికే హిందీ వర్షన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ జియో సినిమా అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు ఆరు నెలలుగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుమారు. రూ. 221 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో కొనసాగుతున్న అక్ష‌య్ కుమార్‌కు ఓ మై గాడ్ 2 కొంతమేరకు ఊరటనిచ్చింది. 

Advertisement
Advertisement