'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం? | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao: రవితేజ సినిమాకు డ్యామేజ్ కంట్రోల్.. ఆ పని ఇప్పుడు చేశారు!

Published Sat, Oct 21 2023 7:15 PM

Tiger Nageswara Rao Movie Duration Decreased After Reviews - Sakshi

మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రాన్ని స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీశారు. మొదటినుంచి ఈ చిత్రం ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి చూపించారు. కానీ మొత్తం రివర్స్‌లో జరిగింది. దీంతో మూవీ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!)

సినిమా అనేది ఎంటర్ టైన్‍‌మెంట్. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు సినిమా కరెక్ట్ లెంగ్త్‌లో ఉంటే పర్లేదు. ఏ మాత్రం వేరుగా ఉన్నా మొదటికే మోసం వచ్చే ఛాన్సు ఉంటుంది. 'టైగర్ నాగేశ్వరరావు' విషయంలో అదే జరిగినట్లు కనిపిస్తుంది. తొలుత ప్రకటించినప్పుడు 3 గంటల నిమిషం 39 సెకన్ల నిడివితో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంత నిడివి ఓకేనా? అని పలువురు అనుకున్నారు.

తీరా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ నిడివి ఇప్పుడు సమస్యగా మారింది. సెకండాఫ్‌లో ల్యాగ్ అవ్వడానికి ఇదే కారణమని ఒక్కరోజులోనే చిత్రబృందం గుర్తించింది. దీంతో దాదాపు 24 నిమిషాల సీన్లని కట్ చేసి పడేశారు. ఇకపై 2 గంటల 37 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు తొలిరోజు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. మరి నిడివిలో మార్పు ఏమైనా ఫలితాన్ని మారుస్తుందా అనేది చూడాలి? అయితే ఈ పని ముందే చేసుంటే బాగుండేదని సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)

Advertisement
Advertisement