శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు

Published Fri, Apr 26 2024 2:39 PM

102 Year Old Casts Vote At Jammu Polling Booth

సార్వత్రిక ఎన్నికలు రెండో దశ పోలింగ్‌లో ఆదర్శంగా నిలిచాడు ఈ శతాధిక వృద్ధుడు. శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడానికి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ జమ్మూలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. చేతి కర్ర, కుటుంబ సభ్యుల సాయంతో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌కి వచ్చి ఓటేశాడు.

ఓటు వేసిన అనంతరం శతాధిక వృద్ధుడు తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిసారీ ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది" అని ఆయన వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.

రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17.81 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే.

Advertisement

తప్పక చదవండి

Advertisement