పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి.. | Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..

Published Wed, Mar 22 2023 9:48 PM

Bride And Groom Performing Wedding Ritual Suddenly Attack Monkey - Sakshi

పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని ఒక  మధురాను ఘట్టం. అలాంటి వాటిల్లో ఏదైన్న అనుకోనిది జరిగితే ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మానవుని ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఈ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..ఓ పెళ్లి వేడుకలో వధువరులు ఆనందంగా పెళ్లి చేసుకుటున్నారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా నిరాటంకంగా జరుగుతోంది. సరిగ్గా ఆ జంట తలంబ్రాలు వేసుకుంటూ ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి నేరుగా మండంపంలోకి వచ్చేసింది. అంతే ఒక్కసారిగా అక్కడున్న వరుడు తలపై అటాక్‌ చేసి కొన్ని అక్షంతలు తీసుకుంది. దీన్ని చూసి వధువు షాక్‌తో ఉండిపోయింది.

క్షణాల్లో ఆమె నెత్తిపై కూడా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారందరూ కంగుతిన్నారు. అయితే ఆ కోతి వారిని ఆశీర్వదించేందుకు వారిపైకి అలా దూకిందేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. 

(చదవండి: హాట్‌ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్‌ లయన్‌ దాడి..ఆ తర్వాత..)


 

Advertisement
 
Advertisement
 
Advertisement