పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత | Importance of Absorbing Right Nutrients Supporting Childhood Growth, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత

Published Fri, Nov 24 2023 4:21 PM

Importance of Absorbing Right Nutrients Supporting Childhood Growth - Sakshi

పిల్లల్లో పోషకాహార లోపం  అనేది ప్రపంచవ్యాప్తంగా  ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో  బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో  పిల్లల ఎత్తు  బరువు వంటి కీలక మైలురాళ్లు.  పిల్లల్లో  ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ,  వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్‌ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం)  అండర్‌ వెయిట్‌ (వయసుకు తగ్గ బరువులేకపోవడం)  వేస్టింగ్‌ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక  అంశాలు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు.  భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్‌ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం,  విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం  లాంటివి  మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో  శక్తి  లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు.

పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం.  పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్‌ న్యూట్రిషన్ బిజినెస్  తెలిపారు.

తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్‌ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి  ఈ  కేంద్రం దృష్టి సారిస్తుంది. 

పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు  అందిస్తూ స్టంటింగ్‌ పై మరింత  శ్రద్ధ  పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్‌ నూట్రిషన్‌ సప్లిమెంట్స్‌ ఇవ్వాలి.  పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా  స్వీకరిస్తాయని వివరించారు.

పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్  జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి.

ఇటీవలి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్‌, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్‌ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్,  పాల ఉత్పత్తులు, ఇంకా  తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్‌ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు,  పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement