వేసవి పూట.. జలకాలాట | Sakshi
Sakshi News home page

వేసవి పూట.. జలకాలాట

Published Sun, May 5 2024 3:15 AM

వేసవి

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఓ పక్క భానుడి భగభగ మండుతుంటే దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తుంటారు చాలా మంది. దానికి ఉపశమనం ఒక్క స్విమ్మింగ్‌తోనే సాధ్యమనుకుంటారు. దీంతో ఆఫీసుల్లో పని ముగించుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటేసుకొని స్విమ్మింగ్‌పూల్‌ల బాట పడుతున్నారు. దీనికి తోడు పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్విమ్మింగ్‌ నేర్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలువురు దేహదారుఢ్యం కోసం, వేసవి ఉపశమనం కోసం స్విమ్మింగ్‌ చేస్తుండడటంతో నగరంలోని స్విమ్మింగ్‌పూల్స్‌ కళకళలాడుతున్నాయి. స్విమ్మింగ్‌కు వచ్చే పలువురిని ‘సాక్షి’ పలకరించగా వారి మనోభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో సందడి

నగరంలో స్విమ్మింగ్‌కు పెరిగిన ఆసకి ్త స్విమ్మింగ్‌ పూల్స్‌లో చిన్నారుల సందడి

వేసవి ఉపశమనానికి ఈత బాట

స్విమ్మింగ్‌తో లాభాలు

స్విమ్మింగ్‌తో చాలా లాభాలున్నాయి. ఎండ నుంచి ఉపశమనమే కాకుండా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. గుండె దృఢంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల పెరుగుదలకు దోహదపడుతుంది.

సందడిగా స్విమ్మింగ్‌ పూల్‌

సమ్మర్‌ హాలీ డేస్‌ ప్రారంభం నుంచే నగరంలోని పలు స్విమ్మింగ్‌ పూల్‌లలో సందడి మొదలైంది. కరీంనగర్‌ లోని అంబేడ్కర్‌ స్టేడియంలో గల స్విమ్మింగ్‌ పూల్‌ చిన్నారులతో కిక్కిరిసిపోతుంది. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలు లేకపోయేసరికి పెద్ద సంఖ్యలో స్వి మ్మింగ్‌ చేసేందుకు వస్తున్నారు. ఉదయం, సా యంత్రం వేళలో స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌ జాతరను తలపించేలా కనిపిస్తుండడం విశేషం.

స్విమ్మింగ్‌ చేసేలా...

స్విమ్మింగ్‌కు వచ్చే చిన్నారులకు మెలకువలు నేర్పించి పూల్‌లో దించుతాం. హ్యాండ్స్‌ ఎలా స్వింగ్‌ చేయాలి, లెగ్స్‌ ఎలా ట్యాప్‌ చేయాలి, ఎయిర్‌ ఎలా తీసుకోవాలి. బాడీ షేప్‌ ఎలా ఉంచుకోవాలి తదితర వాటిపై ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌ చేపిస్తాం. చాలా మంది చిన్నారులు ఈ సంవత్సరం స్విమ్మింగ్‌ చేసేందుకు రావడం శుభపరిణామం.

– ఎండ్ర సంపత్‌, కోచ్‌

ప్రతీ సమ్మర్‌లో వస్తున్నాం

సమ్మర్‌ హాలీడేస్‌ రాగానే స్విమ్మింగ్‌ చేయాలనిపిస్తుంది. అందుకే మేము ప్రతీ సమ్మర్‌లో స్విమ్మింగ్‌ చేస్తాం. ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్‌ చేశాం. హీట్‌ చాలా ఉంది. దానికి ఉపశమనం అంటే స్విమ్మింగ్‌.

– శ్రీనందన్‌, అభినందన్‌

పేరెంట్స్‌ ఎంకరేజ్‌

సమ్మర్‌ వచ్చిందంటే స్విమ్మింగ్‌ చే యాలంటూ పేరెంట్‌ ఎంకరేజ్‌ చేస్తా రు. నేను కూడా సమ్మర్‌ ఎప్పుడు వ స్తుందా అని ఎదురు చూస్తా. హ్యపీగా ఉంటుంది. లాస్ట్‌ ఇయర్‌ కంటే ఈసారి చాలా మంది నేర్చుకుంటున్నారు. – ఆదిత్య, హరీశ్‌

స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం

స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. సమ్మర్‌లో తప్ప మిగతా రోజుల్లో స్విమ్మింగ్‌ చేయడం కుదరదు. సమ్మర్‌ హాలీడేస్‌ రాగానే స్విమ్మింగ్‌ చేస్తా. రోజూ ఉదయం గంట సేపు స్విమ్మింగ్‌ చేస్తే ఎంతో రిలాక్స్‌ అనిపిస్తుంది.

– దక్షిత్‌

త్రీ డేస్‌ నుంచి వస్తున్న..

సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చాయి. స్విమ్మింగ్‌ చేయడమంటే చాలా ఇష్టం. లాస్ట్‌ ఇయర్‌ నేర్చుకుందామనుకున్నా. కానీ నేర్చుకోలేకపోయా. ఇప్పుడు త్రీడేస్‌ నుంచి వస్తున్నా. చాలా హ్యపీగా ఉంది. కొంచెం నేర్చుకున్నా. ఇంకా బాగా నేర్చుకొని డీప్‌లో స్విమ్మింగ్‌ చేస్తా. – ముస్వీరా

ఫస్ట్‌ టైమ్‌..చాలా బాగుంది

వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌ నేర్చుకోవాలని అనుకున్నా. వారం నుంచి వస్తున్నా. హ్యపీగా ఉంది. ఫస్ట్‌ టైమ్‌ స్విమ్మింగ్‌కు రావడం. నా లాగా చాలా మంది వస్తున్నారు. స్వి మ్మింగ్‌ చేస్తే ఎంజాయ్‌గా ఉంది. పెద్దయ్యా క మంచి స్విమ్మర్‌ను అవుతా. – తానియా

స్విమ్మర్‌ కావాలని..

సమ్మర్‌ హాలీడేస్‌లో నేను స్విమ్మింగ్‌కు వస్తున్నా. ప్రజంట్‌ నాకు స్విమ్మింగ్‌ వచ్చింది. డీప్‌లో చేస్తున్నా. శిక్షకులు మా వెంటే ఉంటూ ఈతలో అన్ని రకాల మెలకువలు నేర్పిస్తున్నారు.ఇంకా రోజూ బాగా ప్రాక్టీస్‌ చేసి పెద్ద స్విమ్మర్‌ కావాలని అనుకుంటున్నా. – హాన్సిక

చాలా మంది వస్తున్నారు

ఈయేడు ముందుగానే ఎండలు మండుతుండడంతో స్విమ్మింగ్‌ చేసేందుకు చాలా మంది వస్తున్నారు. వేసవి తాపానికి, శారీరక ధృడత్వానికి స్విమ్మింగ్‌ ఉపయోగపడుతుంది.సెలవుల్లో స్విమ్మింగ్‌ నేర్చుకోవడానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. – చంద్రశేఖర్‌, కోచ్‌

ఫిజికల్‌ డెవలప్‌మెంట్‌కు దోహదం

పిల్లల్లో పెరుగుదల, మంచి శరీరాకృతి రావాలంటే స్విమ్మింగ్‌ చేయాలి. నేటి కాలంలో స్విమ్మింగ్‌పై చాలా మంది ఆసక్తి కబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పిల్లలు తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. మంచి వ్యాయామానికి ఉదాహరణగా స్విమ్మింగ్‌ చెప్పచ్చు.

– శ్రీకాంత్‌రెడ్డి, డీవైఎస్‌వో, కరీంనగర్‌

వేసవి పూట.. జలకాలాట
1/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
2/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
3/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
4/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
5/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
6/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
7/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
8/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
9/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
10/11

వేసవి పూట.. జలకాలాట

వేసవి పూట.. జలకాలాట
11/11

వేసవి పూట.. జలకాలాట

Advertisement
Advertisement