దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.
రికార్డ్ స్థాయిలో వెండి ధరలు
బంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment