మీటింగ్‌కు రమ్మనేవారు.. ఆడిషన్‌ మాత్రం కాదనేవారు!: నటి | Heeramandi Actress Abha Ranta Reveals Her Experiences On The Casting Couch, Deets Inside | Sakshi
Sakshi News home page

ఫోన్లు చేసి రావాలనేవారు.. భయంతో నేనసలు వెళ్లేదాన్నే కాదు!: హీరామండి నటి

Published Sat, May 18 2024 2:12 PM | Last Updated on Sat, May 18 2024 3:38 PM

Heeramandi Actress Abha Ranta on Casting Couch

బాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ హీరామండి: ద డైమండ్‌ బజార్‌. రెండు వారాల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో మనీషా కొయిరాలా.. మల్లికాజాన్‌ అనే పాత్రను పోషించింది. టీనేజ్‌ మల్లికగా నటి అభా రంత కనిపించింది.

క్యాస్టింగ్‌ కౌచ్‌?
తాజాగా ఈమెకు ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నావా? అని అడగ్గా డైరెక్ట్‌గా కాకపోయినా పరోక్షంగా అలాంటి ఇబ్బందుల్ని ఫేస్‌ చేసినట్లు బదులిచ్చింది. అభా మాట్లాడుతూ.. 'కొందరు ఫోన్‌ చేసి మీటింగ్‌ ఉంది రమ్మని చెప్పేవారు. కానీ ఇది ఆడిషన్‌ కాదని నొక్కి మరీ చెప్పేవారు. నాకసలు అర్థమయ్యేది కాదు.. అదేంటి? ఫోన్‌ చేసి రమ్మంటున్నారు.. కానీ ఆడిషన్‌ కాదంటున్నారేంటని తికమక పడేదాన్ని. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని అసలు మీటింగ్‌కు వెళ్లేదాన్నే కాదు. అసలు సంగతేంటో వెళ్లి చూద్దామని ధైర్యం చేసేదాన్నే కాదు.

ఎవరూ నాతో..
నేరుగా మాత్రం ఎవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నీకు పని కావాలంటే ఇది చేయాలి.. ఫలానా దానికి ఒప్పుకోవాలి అని ఎవరూ నాతో చెడుగా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు షార్ట్‌కట్స్‌ నచ్చవు. ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని.. ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూసేదాన్ని. నాకది మాత్రమే తెలుసు' అని అభ చెప్పుకొచ్చింది. అభ సోదరి ప్రతిభ రంత కూడా హీరామండిలో నటించింది. 

చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement