May 18th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 18th Political Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 18th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

Published Sat, May 18 2024 7:12 AM | Last Updated on Sat, May 18 2024 4:19 PM

AP Elections 2024: May 18th Political Updates In Telugu

May 18th AP Elections 2024 News Political Updates
 

04.11 PM, May 18th, 2024

అమరావతి

పోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్  వెళ్లాయి
సాక్షితో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్

  • క్లూస్ టీమ్స్‌తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారు
  • అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లు పరిశీలించి అవసరమైన చోట అదనపు FIR లు నమోదు చేస్తాం
  • వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం
  • ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇస్తాం
  • సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాం
  • రెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుంది

03.52 PM, May 18th, 2024

తిరుపతి జిల్లా

నామినేషన్‌ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే:
రామచంద్రాపురం మండలం, జడ్పీటీసీ భార్య ఢిల్లీ రాణి

  • పోలింగ్‌ రోజు కూచివారిపల్లెల్లో కోటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది టీడీపీ వాళ్లే
  • ముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతి దాడి చేశారు
  • వైఎస్సార్‌సీపీ వాహనాలు టీడీపీ వాళ్లు ధ్వంసం చేశారు
  • టీడీపీ వారిపై మాకు వ్యక్తిగత కక్షలు లేవు
  • దౌర్జన్యాలు మేము ఏ రోజు మేము చేయలేదు
  • గాయపడిన వారు ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా దాడి చేశారు
  • కేసులో సంబంధం లేనివారిని కూడా కేసులో ఇరికిస్తున్నారు

01.45 PM, May 18th, 2024
కడప

  • ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్‌
  • హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధం
  • రౌడీ షీటర్లపై ప్రత్యేక​ నిఘా పెట్టాం
  • ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం

01.30 PM, May 18th, 2024

  • తిరుపతికి చేరిన సిట్‌ బృందం  
  • స్థానిక అధికారులతో సమావేశం  
  • పోలింగ్‌, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్‌

01.00 PM, May 18th, 2024
కృష్ణా జిల్లా
అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్

  • రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడు
  • ప్రణాళిక బద్ధంగా  వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు
  • గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు
  • ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడు
  • ఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి
  • అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడు
  • ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు
  • టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది
  • కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడు
  • ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు
  • వైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండి
  • టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం

12.30 PM, May 18th, 2024
ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!

  • 400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబు
  • హైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్‌
  • .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలు
  • చేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపం

     

12.00 PM, May 18th, 2024
దూకుడు పెంచిన సిట్

  • ఎన్నికల  హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తు
  • నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్
  • డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్
  • వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన  13 మంది టీం
  • 13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్‌లాల్
  • మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్
  • తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్
  • హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్
  • హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్
     

11.30 AM, May 18th, 2024
తిరుపతి
జగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజా​

  • తాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజా
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు
  • మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 
     

11.00 AM, May 18th, 2024
మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్

  • స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.
  • వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?
  • మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు,  "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న  "పుష్పా "  2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.
  • 2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?
     

10.30 AM, May 18th, 2024
చింతమనేని  దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్‌

  • పరారీలో టీడీపీ నేత ప్రభాకర్‌
  • పోలింగ్‌  రోజు జరిగిన హత్యాయత్నం కేసు​లో రాజశేఖర్‌ నిందితుడు
  • అతన్ని పోలీసు స్టేషన్‌ నుంచి దౌర్జన్యంగా  తీసుకెళ్లిన చింతమనేని
     

9.30 AM, May 18th, 2024
నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?

  • అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్
  • నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ 
  • దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు

 

9.00 AM, May 18th, 2024
అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడ

  • పోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ  ఆందోళనకు కుట్ర 
  • పోలీసులకు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్న
  • ముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు

8.30 AM, May 18th, 2024
హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం 

  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్‌లో ఓ అదే భవనంలో  ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యం
  • మైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి  కాలింగ్ 
  • పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యం
  • గత మూడు నెలలుగా సర్వే  నడుపుతున్న యాజమాన్యం
  • రెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ 
  • ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం 
  • క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నం
  • మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనం
  • టీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
  • రాత్రి కి రాత్రే పరారీ
  • ఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలు
  • కూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు

 

7.45 AM, May 18th, 2024
విజయవాడ

ఎన్నికల  హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభం

  • నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌
  • వినీత్ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
  • సిట్ బృందంలో 13 మంది అధికారులు
  • ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకం
  • ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు,  రవి మనోహర చారి నియామకం
  • ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకం
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్
  • ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తు
  • రేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్

 

7.30 AM, May 18th, 2024
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట

  • కుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్‌ బలి
  • వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు
  • ఆగమేఘాలపై కేసు నమోదు
  • పోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె
     

7.00 AM, May 18th, 2024
కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!

  • 2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ కల్పించిన వరం...
  • గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువత
  • విద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..
  • రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మరింత ఊతం
  • కూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు..
     

6.30 AM, May 18th, 2024
పల్నాడుపై పగబట్టిన బాబు

  • టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులు
  • నాటి నుంచి నేటి వరకు అదే తీరు
  • 2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడి
  • విజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబు
  • ఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీ
  • అభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement