May 31th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 31th Political Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 31th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Fri, May 31 2024 8:45 AM | Last Updated on Fri, May 31 2024 5:47 PM

AP Elections 2024: May 31th Political Updates In Telugu

May 31th AP Elections 2024 News Political Updates..

5:36 PM, May 31st, 2024

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న కార్డన్ & సెర్చ్ ఆపరేషన్:  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

  • శాంతి భద్రతల పరిరక్షణ , నేర నియంత్రణే లక్ష్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
  • అనుమానిత వ్యక్తులు , పాత నేరస్తులు , కొత్త వ్యక్తుల పై ప్రత్యేక నిఘా
  • గడచిన 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 579 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు
  • సరైన పత్రాలు లేని 3524 వాహనాలు సీజ్
  • 1400 లీటర్ల బెల్లపు ఊట, 307 లీటర్ల మద్యం , 67 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్
  • 16 మంది అరెస్ట్

3:00 PM, May 31st, 2024

ఏపీ ఎన్నికల ఫస్ట్ రిజల్ట్ ఎక్కడ?

  • గోదావరి జిల్లాల నుంచే మొదటి ఫలితం వెలువడుతుందా?
  • గోదారోళ్లు ఎవరికి మద్దతిచ్చారో మధ్యాహ్నానికి క్లారిటీ
  • 13 రౌండ్లలో నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
  • ఈ రెండింటిలో ఏదో ఒకటి తొలి ఫలితం అంటున్న అధికారులు
  • 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్న ఆచంట, పాలకొల్లు
  • 15 రౌండ్లలో పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, మచిలీపట్నం, బాపట్ల నియోజకవర్గాలు
  • తొలి మూడు గంటల్లోనే దాదాపు గోదావరి జిల్లాలలోని ఎనిమిది నియోజకవర్గ ఫలితాలు
  • చిట్టచివరగా రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలు
  • ఈ రెండు చోట్ల 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • భీమిలి, పాణ్యం నియోజకవర్గాలలోనూ ఫలితాలు రాత్రికి వచ్చే అవకాశం
  • ఈ రెండింటిలో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు
  • పులివెందుల, కుప్పం ఫలితాలకి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే
  • మధ్యాహ్నానికే పిఠాపురం ఫలితాలు

2:00 PM, May 31st, 2024

ప్రజలకు, జగనన్నకి మధ్య ఉన్న బంధం ఎవరూ చెరిపేయలేనిది.. పెత్తందారులకి ఎప్పటికీ అర్థంకానిది

 

 

12:30 PM, May 31st, 2024
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు..

  • అమరావతి...
  • ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు
  • పి. శ్రీలేఖపై ఒంగోలు పార్లమెంటు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బదిలీ
  • ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ.మురళి, డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ.రాంభూపాల్ రెడ్డి బదిలీ  
  • ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి
  • బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జవహర్ రెడ్డి
  • వీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారం
  • ఎం.వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ
  • సి.విశ్వనాధ్‌ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ
  • జే.శిరీషను అనంతపురం పిఏబిఆర్-2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ
     

11:45 AM, May 31st, 2024
ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?

  • మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం..
  • ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?
  • దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?
  • పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై వైఎస్సార్‌సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది.
  • అంటే ఈసీ తప్పు చేసినట్లేగా?

 

 

11:00 AM, May 31st, 2024
ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామ కొత్త డ్రామా.. 

  • విశాఖ ఆసుపత్రిలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామ
  • ఈరోజు మండలి ఛైర్మన్‌ ఎదుట హాజరుకావాల్సిన రఘురామ. 
  • విచారణ నుంచి తప్పించకోవడానికి రఘురామ ఎత్తుగడ.

 

10:15 AM, May 31st, 2024
అల్లరి మూకలకు పల్నాడు ఎస్పీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

  • పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
  • రాజకీయ నేతల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. 
  • ప్రశాంతతకు భంగం కలిగిస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం. 
  • ఒక్కసారి రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తే మీ జీవితం నాశనం అయినట్టే. 
  • చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. 
  • పల్నాడు జిల్లా పేరు చెబితే దేశం ఉలిక్కి పడేలా చేశారు.

 

9:40 AM, May 31st, 2024
పచ్చ బ్యాచ్‌ ఫేక్‌ బతుకు బట్టబయలు..

  • టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!
  • చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియా
  • సీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.
  • కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎస్
  • గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
  • టీడీపీది ఫేక్‌ బతుకంటూ ప్రజల ఆగ్రహం.
     

 

9:00 AM, May 31st, 2024
స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌

  • తిరుపతి జిల్లా..
  • అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
  • హర్షవర్ధన్ రాజు కామెంట్స్..
  • స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.
  • కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.
  • ఔటర్ కార్డెన్‌లో మూడు మొబైల్ పార్టీస్‌తో నిరంతర పహారా కొనసాగుతోంది.
  • స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.
  • స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు.

 

8:40 AM, May 31st, 2024
తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌

  • అనంతపురం..
  • తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకం
  • ఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డి
  • కాగా, రాంభూపాల్‌ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం

 

8:00 AM, May 31st, 2024
ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట

  • వైఎస్సార్‌ జిల్లా..
  • మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట
  • చాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.
  • ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు
  • అరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం

 

7:45 AM, May 31st, 2024
విశాఖలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌..

  • విశాఖపట్నం.. పీఎం పాలెం..
  • ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్
  • నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.
  • సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.
  • రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.
  • జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.
  • కార్డన్ సెర్చ్‌లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

7:30 AM, May 31st, 2024
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం

  • కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్‌ 
  • అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం 
  • ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ 
  • సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదం 
  • ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు 
  • హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్‌సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు
  • ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ పిటిషన్‌  
  • ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్‌లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం

 

7:00 AM, May 31st, 2024
స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’!

  •  ఆ మేరకు టీడీపీ బేరసారాలు 
  • కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడ
  • అవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement