విద్యార్థులకు అభినందన | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అభినందన

Published Sun, May 5 2024 3:15 AM

విద్య

కరీంనగర్‌కల్చరల్‌: బాలసదనం, చైల్డ్‌కేర్‌ ఇనిస్టిట్యూషన్‌లో చదువుతూ, మిషన్‌ వాత్సల్య ద్వారా ఉపకార వేతనం పొంది పదో తరగతి, ఇంటర్‌లో మంచి ఫలితాలు సాంధించిన 13 మంది విద్యార్థులను కలెక్టర్‌ పమేలా సత్పతి శనివారం అభినందించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులు బాలసదనంలో ఉంటూ మంచి ఫలితాలు సాధించారని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, అడిషనల్‌ డీఆర్‌డీవో సంధ్యారాణి, డీసీపీవో శాంత, సిబ్బంది తిరుపతి, రమేశ్‌, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.

బిషప్‌కు మంత్రి శుభాకాంక్షలు

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌ దక్షిణ మండలి అధ్యక్షుడిగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న బిషప్‌ రూ బెన్‌మార్క్‌ను శనివారం మంత్రి పొన్నం ప్రభా కర్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని చర్చి ప్రతినిధులు సన్మానించారు.

బిషప్‌ దంపతులకు సన్మానం

కరీంనగర్‌ బిషప్‌ డాక్టర్‌ రూబెన్‌మార్క్‌ పదవీ బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో బిషప్‌ కార్యాలయ మాజీ ఉద్యోగి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బొబ్బలి విక్టర్‌ సతర్కించి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌.బాబు, అమిత్‌కుమార్‌, ఎం.రాంరెడ్డి, కె.రాజకుమార్‌, ఆర్‌.తిరుపతి, ఎస్‌.శివప్రసాద్‌, ప్లాస్టర్లు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

కమలం గూటికి

స్వర్ణకార సంఘం నేతలు

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ నగర స్వర్ణకారుల సంఘం నేతలు శనివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ సమక్షంలో కమలం గూటికి చేరారు. కరీంనగర్‌ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రావుల శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు కడర్ల చంద్రశేఖర్‌, వెగ్గళం రామకృష్ణ, ముతోజు ప్రకాష్‌, శ్రీరామోజు కిరణ్‌, శ్రీరామోజు రవీంద్రచారి, ముల్కల సతీశ్‌, కళికోట గణేశ్‌, రాజశేఖర్‌, విశ్వం, మియ్యపురం కిరణ్‌, క్రాంతి, శ్రావణ్‌, సంతోష్‌, వెంకటేశ్‌, తదితర నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ బండి సంజయ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో 46వ డివిజన్‌ బీజేపీ ఇన్‌చార్జి కళికోట మోహన్‌, బీజేవైఎం నాయకులు కనపర్తి రామ్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

బీసీ సదస్సును

విజయవంతం చేయాలి

కరీంనగర్‌కల్చరల్‌: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 7న జరిగే బీసీల రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు కోరారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగే సదస్సులో చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, జాతీయస్థాయిలో బీసీ కులగణన జరగాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోష న్లు, రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, అలాగే రి జర్వేషన్లపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.

భూమయ్య మృతికి సంతాపం

విద్యానగర్‌: వెల్గటూర్‌ మండల విద్యాధికారి బత్తుల భూమయ్య విధినిర్వహణలో వడదెబ్బ తగిలి మృతి చెందడంపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంతాపం ప్రకటించింది. శనివారం చొప్పదండిలోని ఆయన స్వగృహంలో భూమయ్య పార్దీవ దేహాన్ని దర్శించి పూలమాలు వేసి నివాళ్ళర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా భూమయ్య విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. నివాళి అర్పించిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ నాయక్‌, జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్‌, నాయకులు గిరి సురేష్‌, కోదారి రవీందర్‌ తదితరులున్నారు.

విద్యార్థులకు అభినందన
1/3

విద్యార్థులకు అభినందన

విద్యార్థులకు అభినందన
2/3

విద్యార్థులకు అభినందన

విద్యార్థులకు అభినందన
3/3

విద్యార్థులకు అభినందన

Advertisement
Advertisement