కృష్ణా, సాక్షి: ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవని.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే.. ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరగుతున్నాయని అన్నారాయన.
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికలై నాలుగు రోజులైనా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే..
.. అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారు. టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. కులాలు,మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు అని జోగి రమేష్ అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండి. టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని జోగి రమేష్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment