Jogi Ramesh
-
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
కృష్ణా, సాక్షి: ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవని.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే.. ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరగుతున్నాయని అన్నారాయన. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికలై నాలుగు రోజులైనా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే.... అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారు. టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. కులాలు,మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు అని జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండి. టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని జోగి రమేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. -
టిడిపి డర్టీ పాలిటిక్స్
-
ఆ కుటంబానికి అన్యాయం జరిగింది అండగా ఉండాలి
-
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి శతజయంతి వేడుకలు చేస్తున్నారు
-
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
-
పవన్‌కు తెలిసిందల్లా బాబుకు చెంచాగిరీ చేయడమే: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్. పవన్‌ను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమేనని దుయ్యబట్టారు. సోమవారం మీడియా సమావేశంలో పవన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేశ్. ‘పవన్ విజిటింగ్ వీసా మీద వచ్చి ఏదో వాగిపోయాడు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా? జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్. ఆయనను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయం. పవన్‌కు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమే. నోటికొచ్చినట్లు మాట్లాడటం, రెచ్చగొట్టడమే పవన్‌కు తెలుసు. హింసను ప్రేరేపించే వ్యక్తి పవన్ కల్యాణ్ ’ అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ఇదీ చదవండి: ‘చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడింది’ -
‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు’.. అనురాగ్ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి
తాడేపల్లి: విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి జోగి రమేష్. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 90 వేలమందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని ఆశ పడుతున్నారని ఆరోపించారు. ‘యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తారా? ఢిల్లీ నుంచి రావటం, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లటం కాదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? దమ్ముంటే చర్చకు వచ్చి సమాధానం చెప్పాలి. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించాం. రాష్ట్రంలో దోపిడీ చేసింది ఎవరు? రాష్ట్రంలో మీరు పెంచి పోషించిన చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు. అసలు మీకు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. హామీ ఇచ్చిన యూనివర్సిటీలు, లోటు బడ్జెట్ నిధులు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో మతతత్వ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? మా రాష్ట్రాన్ని మోసం చేసిన మీకు ఏం చూసి ఓటెయ్యాలి? మీరు ఒక్క ఎమ్మెల్యే సీటు కాదుకదా.. వార్డు సభ్యునిగా కూడా గెలవలేరు.’ అని అనురాగ్ ఠాగూర్‌పై ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్‌కి కనీసం అన్ని సీట్లలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. వైఎస్ జగన్ సీఎం అయినందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అసలు పవన్‌కి కౌలు రైతులు, వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? చెప్పాలన్నారు. 2014లో జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టారని.. 2024లో కూడా అదే చేస్తారని విమర్శించారు. తన ప్యాకేజీ తీసుకుని పవన్ వెళ్ళిపోతారని.. కులాలను రెచ్చగొట్టే తెగులు చంద్రబాబు, పవన్‌దేనన్నారు. అందుకే గత ఎన్నికలలో వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. 2024లో 175 సీట్లు వైఎస్ఆర్సీపీ సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ము వీరెవరికీ లేదని.. ఐదు కోట్ల జనం ఆయన వెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు.. -
సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నేతలు ఏడుస్తున్నారు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్ సదస్సుకు వెళ్తే టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లటం తప్పా?. పట్టాభి, యనమలలాంటి వ్యక్తులు కడుపు ఉబ్బరంతో అల్కాడిపోతున్నారు. గతంలో చంద్రబాబు తన వెంట దోపిడీ దొంగలను తీసుకుని వెళ్లాడు. దోచుకున్న సొమ్మును దాచుకోవటానికి 38 సార్లు తీసుకెళ్లాడు. సీఎం వైఎస్ జగన్ మొదటిసారి కుటుంబ సభ్యులతో వెళ్తే ఓర్చుకోలేక పోతున్నారు. ఏం జరిగిందని చిలవలు వలువలుగా కథనాలు రాస్తున్నారు?. వీరందరి పాపం పండింది. యనమల రామకృష్ణుడి వయసెంత? మాట్లాడే మాటలు ఏంటి?. చంద్రబాబుకు మతిమరుపు రోగం, యనమలకు కడుపు ఉబ్బరం రోగం, పట్టాభికి కడుపు మంట రోగం గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లి బుల్లెట్ రైలు పక్కన నిలపడి ఫొటోలు తీసుకున్నారు. మేము దావోస్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. ఇది చూసి తట్టుకోలేక అనవసరంగా ఊగిపోతున్నారు. మీరు ఎంత ఊగిపోయినా సీఎం వైఎస్ జగన్ వెంటే జనం ఉన్నారని గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు చేసిన వంచన, దుర్మార్గాలు ఊరికే పోవు. అన్ని వర్గాలనూ వేధించిన పాపం వలనే 23 సీట్లకు పరిమితం అయ్యాడు. మా పార్టీకి చెందిన వ్యక్తి కేసులో ఇరుక్కుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోమని సీఎం జగన్ చెప్పారు. సీఎం జగన్ దావోస్ వెళ్లింది రాష్ట్ర అభివృద్ధి కోసమే. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మంచి జరుగుతుందని మేం భావిస్తున్నాం. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ఆయనను జనం నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ 23 సీట్లు కూడా రావు. సీఎం జగన్ అన్ని వర్గాలకూ దేవుడిలా మారారు. మా ఎమ్మెల్సీపై ఆరోపణలు వస్తే వెంటనే అతనిపై కేసు పెట్టమని సీఎం చెప్పారు. చట్టం అందరికీ సమానమే’’ అని స్పష్టం చేశారు. -
మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా
పెడన : ‘మీ వాడిగా ఉంటా.. మీకు తోడుగా ఉంటా.. సమస్యలు ఏమైనా నేరుగా నా దృష్టికి తీసుకురండి.. ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న మీకు కృతజ్ఞతలు.. అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి పెడన పట్టణానికి వచ్చిన జోగి రమేష్ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పురప్రజలు బ్రహ్మరథం పట్టారు. బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు బారులుతీరి నీరాజనాలు పలికారు. అనంతరం పట్టణంలోనికి ప్రవేశించిన మంత్రి వర్యులకు 23వ వార్డులో పురపాలక చైర్పర్సన్ బళ్ల జ్యోత్స్నరాణి, వైస్ చైర్మన్లు ఎండీ ఖాజా, బైలపాటి జ్యోతి, ఫ్లోర్ లీడర్ కటకంప్రసాద్‌లతో పాటు పలువురు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావులు స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా నడుచుకుంటూ చేరుకున్నారు. మార్గం మధ్యలో చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నేత సరుల వద్దకు చేరి వారి కష్టంలో కాసేపు పాలు పంచుకున్నారు. మండల కన్వీనర్ కొండవీటి నాగబాబు, ఎంపీపీ రాజులపాటి వాణి, మాజీ ఎంపీపీ అచ్యుతరావు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ గరికిపాటి చారుమతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిలిచిన రోడ్ షో.. మంత్రి రోడ్డు షో పెడన నుంచి బలిపర్రు, నందమూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో కొనసాగాల్సి ఉండగా.. పెడన పార్టీ కార్యాలయం వరకు వచ్చిన తర్వాత గూడూరు మండలం కోకనారాయణపాలేనికి చెందిన సర్పంచ్ బండి రమేష్ ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడంతో ర్యాలీని అర్ధంతరంగా నిలిపేశారు. -
ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసులో కర్త, కర్మ, క్రియ ఆయనేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినా చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఎందుకు విచారణకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఇలా దొరికిపోయిన నేతను వదిలిపెట్టడం వల్ల ప్రజలకు చట్టం, రాజ్యాంగంపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలిపారు. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని, ఆ సమయంలో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు పాత్రను ఈడీ ప్రస్తావించిందన్నారు. అవి చంద్రబాబు మాటలేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. చంద్రబాబు సూచనలతోనే తాను రాయబారం చేశానని ఈడీకి మత్తయ్య వాంగ్మూలం ఇచ్చినా చంద్రబాబును విచారించకపోవడం సరికాదన్నారు. ఇలాగైతే వ్యవస్థలపై సామాన్యులకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబును విచారించి శిక్ష విధించాలని ఈడీని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌పై విషం చిమ్మడానికే మహానాడు డ్రామా జూమ్ మీటింగ్‌లో రోజంతా మాట్లాడిన చంద్రబాబు.. రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు బుక్ చేసిన విషయంపై ఎందుకు స్పందించలేదని జోగి రమేష్ నిలదీశారు. పార్టీ వ్యవస్థాపకుడి చావుకు కారణమై.. ఇప్పుడు మహానాడు పేరుతో హైదరాబాద్ నుంచి జూమ్‌లో గంటలు గంటలు మాట్లాడుతూ డ్రామాలాడుతుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే మహానాడులో చంద్రబాబు అండ్ కో పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల ప్రభుత్వ విజయాలను మరుగునపర్చాలన్న ఏకైక అజెండాతో రెండు రోజులు మహానాడు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా దీవెనలు ఎల్లప్పుడూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని చెప్పారు. -
టీడీపీ బహిష్కరణ ఓ నాటకం
సాక్షి, అమరావతి: టీడీపీ శాసనసభ సమావేశాల బహిష్కరణ ఓ నాటకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. కరోనా ఉందని భయపడి పక్క రాష్ట్రానికి చంద్రబాబు, లోకేశ్ పారిపోయారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు ఒక రోజా, రెండు రోజులా అనేది ముఖ్యం కాదని చెప్పారు. సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఎప్పుడు వస్తుంది.. అని సహజంగా ప్రతిపక్షం ఎదురు చూడాలన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకై సీఎం జగన్ అన్ని సమస్యలను తీరుస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ప్రస్తావించేందుకు సమస్యలేమీలేవని, అందుకే శాసనసభ సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టుకుని రాజద్రోహనికి పాల్పడుతున్నారన్నారు. రఘురామ ఓ బ్రోకర్ అని మండిపడ్డారు. ఏడాదిగా ఆయన చేసే విమర్శలు, చేష్టలు, తీరు చూసి ప్రజలు విసిగిపోయి ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్, ఇతర మందులు, ఇతర సహాయం కావాలని కేంద్రానికి లేఖరాయని చంద్రబాబు.. రఘురామ గురించి కేంద్రంలోని ముఖ్యులందరికి లేఖలు రాశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఆయనపై ఉన్నంత ప్రేమ ప్రజలపై లేదన్నారు. చంద్రబాబు తాబేదారు, తొత్తుగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
కరోనా కష్ట కాలం లో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నాం
-
సభ్యత మరిచి బాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ అస భ్యంగా మాట్లాడుతూ ప్ర జలను రెచ్చగొడుతున్నా రని వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఇంగితజ్ఞానం లేకుండా పిచ్చికుక్కల్లా వ్యవహరిస్తూ ప్రజలపైనా, సీఎం జగన్‌పైనా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారిద్దరూ సభ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి తండ్రీకొడుకు విషపురుగుల్లా తయారయ్యారని నిప్పులు చెరిగారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఇద్దరూ ఏపీ వదిలి పారిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దేశం వదిలిపోయే పరిస్థితి వారికి వస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా వారి బుద్ధి మారలేద ని ధ్వజమెత్తారు. సీఎంను ఉద్దేశించి ఏం పీకుతావ్ అని అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎంత దిగజారిపో యారో వారి మాటలను బట్టే అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకలేకపోయారని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారిని కలుపుమొక్కల్లా పీకేశారని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వందశాతం విజయదుందుభి మోగిస్తుందన్నారు. విజయవాడలో ఇప్పటికే టీడీపీ నిట్టనిలువుగా చీలిపోయిందని ఆయన చెప్పారు. -
ఈసీనీ అడ్డుపెట్టుకుని బాబు కుట్ర చేస్తున్నారు
-
'బాబుకు ఈ ఏడాది ఏడుపుగొట్టు నామసంవత్సరం'
సాక్షి,తాడేపల్లి : 2019 సంవత్సరం చంద్రబాబుకు ఏడుపుగొట్టు నామ సంవత్సరమని, ఆయనకు ఈ ఏడాది ఏడ్పులు, పెడబొబ్బలతోనే గడిచిందని ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకనే నిత్యం ఏడుస్తున్నాడని తెలిపారు. సీఎం జగన్ శాసనసభలో చారిత్రక చాట్టాలను ప్రవేశపెడితే ఆయన సహించలేకపోతున్నారని అందుకే అసెంబ్లీ నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లేవారని పేర్కొన్నారు. దిశ బిల్లు, మహిళ రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అభినందించకుండా ఏడుస్తూ బయటకు వెళ్లిపోయింది నీవు కాదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ 80 నుంచి 90 శాతం అమలు చేశారని అందులో రైతు భరోసా, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తున్నామని, అలాగే పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును అందజేస్తామంటే బాబు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 'రాజధాని ప్రాంతంలో పుట్టినవాడిగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్న.. గత ఐదేళ్ల కాలంలో సీఎంగా పనిచేసిన మీరు అమరావతికి ఏం చేశారో చెప్పండి'. ఈ ఐదేళ్లలో బాబు కేవలం తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపించాడు తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు. సుజనా చౌదరి పచ్చి మోసగాడు, ప్రజల దనాన్ని కొల్లగొట్టిన మాయగాడని జోగి రమేశ్ వెల్లడించారు. సుజనా చౌదరి పేరుకే బీజేపీ నాయకుడని కానీ పరోక్షంగా ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారని, అందుకే బాబు తన చిలుకపలుకులను సుజనా నోటి ద్వారా పలికిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి వేలకోట్లు దొంగతనం చేసిన సుజనా చౌదరి లాంటి వ్యక్తికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. (బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్ సాధ్యం కాదు : కొడాలి నాని) -
తక్షణమే స్పందించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి గురైతే ప్రభుత్వ యంత్రాంగం నుంచి తక్షణ స్పందన కరువైంది. వైఎస్సార్సీపీ నేతలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, ఉదయభాను తమ అనుచరులతో కలసి పది నిమిషాల్లోనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. అప్పటికి అధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలే స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి నదిలోకి పంపించారు. బోల్తా పడిన బోటు కింద పర్యాటకులు ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు గుర్తించారు. బోటును కొంతమేర పగుల కొట్టి నీటిలో ఉన్న పర్యాటకులను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. నీట మునిగి ఉన్న మరికొందరు పర్యాటకులను బయటకు తీశాయి. అంబులెన్స్‌ల రాక ఆలస్యం కావడంతో బాధితులను ఆటోల్లోనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఘటన జరిగి దాదాపు 45 నిమిషాలయ్యాక వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు అక్కడే ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నేతలను నెట్టివేసేందుకు ప్రయత్నించారు. -
ఆదినారాయణరెడ్డి రాజీనామా చేశావా?
సాక్షి, విజయవాడ : ఏపీ మంత్రులు నారా లోకేశ్, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కు ఎప్పుడిచ్చావ్. మరి స్పీకర్ ఎందుకు ఆమోదించలేదు?. ఆదినారాయణరెడ్డి నీకు దమ్ము, ధైర్యముంటే రాజీనామా ఆమోదింపచేసుకుని ఎన్నికలకు రావాలి. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే మీకు భయమెందుకు?. 420 అనగానే ఏపీలో గుర్తుకొచ్చేది చంద్రబాబే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని తప్పులు లేకుండా పలకగలవా లోకేశ్. అఆలు, ఏబీసీడీలు రాని లోకేశ్ కూడా జగన్‌ను విమర్శించడమా?, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మంత్రి దేవినే ఉమకు బహిరంగ లేఖ రాస్తున్నా. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. టైమ్, డేట్, ప్లేస్ చెబితే నేను చర్చకు సిద్ధం. 24 గంటల్లో స్పందించకపోతే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేఖను ఇరిగేషన్ కార్యాలయానికి, మీ ఇంటికి పంపుతున్నా.’ అని పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలంతా అప్పుడే తమ రాజీనామా లేఖల్ని స్పీకర్‌కు అందచేశామని, వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘బాబు జీవితమే అక్రమం’
విజయవాడ: నది పక్కన అక్రమ నివాసంలో నివసిస్తున్న సీఎం చంద్రబాబు నదుల పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. సేవ్ రివర్స్ పేరుతో బాబు అన్ని రివర్స్ పనులే చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజ జీవితమే అక్రమమని ధ్వజమెత్తారు. టీడీపీలో చేరి మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లోనూ సీఎం అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం కమిషన్ల కోసమే ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టారని జోగి రమేష్ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి సినిమా దర్శకుల సహకారం కావాలా అని సీఎంను ఆయన ప్రశ్నించారు. నిర్మాణంపై ఇంజనీర్స్కు ఎక్కువగా అవగాహన ఉంటుందని, దర్శకులకు డిజైన్లు ఎలా తెలుస్తాయన్నారు.