ఒక్కరోజులో 797 కరోనా కేసులు | Coronavirus In India: India Covid-19 New Subvariant JN.1 Cases Tally Rises To 162, Check Cases Details Inside - Sakshi
Sakshi News home page

Coronavirus Cases In India: ఒక్కరోజులో 797 కరోనా కేసులు

Published Sat, Dec 30 2023 6:19 AM

India Covid-19 subvariant JN.1 tally rises to 162 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్‌.1 ఉప వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్‌ కేసుల 4091కి చేరుకుంది.

ఇప్పటివరకు జేఎన్‌.1 వేరియంట్‌ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్‌లో 34 జేఎన్‌.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్‌.1 ఉప వేరియంట్‌ కేసులు నమోదైనట్లు ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జినోమిక్స్‌ కన్సారి్టయం(ఇన్సాకాగ్‌) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు.

Advertisement
Advertisement