Top Condom Brands In India; Know The Name And Details - Sakshi
Sakshi News home page

భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్‌ బ్రాండ్స్‌..

Published Thu, Jun 22 2023 7:23 AM

Top Condom Brand India Know the Name and Details - Sakshi

భారత్‌లో పలు కంపెనీలు తమ కండోమ్‌లను విక్రయిస్తున్నాయి. కండోమ్స్‌ ప్రొడక్ట్‌ రేంజ్‌ కూడా అధికంగానే ఉంటుంది. డ్యూరెక్స్‌ కండోమ్‌ భారత్‌తో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయమయ్యే నంబర్‌ వన్‌ బ్రాండ్‌. 150 దేశాల్లో ఈ కండోమ్స్‌ విక్రయమవుతున్నాయి. 

దేశరాజధాని ఢిల్లీలోని మ్యాన్‌ఫోర్స్‌ బ్రాండ్‌ భారత్‌లో అత్యధికంగా కండోమ్స్‌ విక్రయించే కంపెనీగా చెప్పుకుంటుంది. సంబంధిత చార్ట్‌లో ఈ బ్రాండ్‌  పేరు టాప్‌లో కనిపిస్తుంది. మ్యాన్‌కోర్స్‌ బ్రాండ్‌ మ్యాన్‌కైండ్‌ ఫార్మ్‌కు సంబంధించినది. ఇటీవలే ఈ కంపెనీ లిస్టింగ్‌ షేర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

స్కోర్‌.. టీటీకే ప్రొటెక్టివ్‌ డివైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ కండోమ్‌ బ్రాండ్‌. బారత్‌లో ఈ బ్రాండ్‌ విక్రయాలు జోరుగా దూసుకుపోతున్నాయి. ​కామసూత్ర భారత్‌లోని ప్రముఖ కండోమ్‌ బ్రాండ్‌లలో ఒకటి. 2017లో రేమాండ్‌ ఈ కామసూత్ర బాండ్‌ను కొనుగోలు చేసింది.

​కోహినూర్‌ కండోమ్‌ బ్రాండ్‌ విక్రయాల విషయంలో భారత్‌లో ముందుంది. రాకెట్‌ అండ్‌  బెంకింజర్‌ ఇండియా 1979లో కోహినూర్‌ కండోమ్‌ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 

దీనితోపాటు భారత్‌లో ‘మూడ్స్‌’ కూడా ఆదరణ పొందిన కండోమ్‌ బ్రాండ్‌. మార్కెట్‌లో మూడ్స్‌ కండోమ్‌లలో పలు రకాల సిరీస్‌ అందుబాటులో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..

Advertisement
 
Advertisement
 
Advertisement