నిర్మల్‌ | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Fri, Apr 19 2024 1:35 AM

- - Sakshi

శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

ఆరోగ్య లక్ష్యాలను సాధించాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ ధనరాజ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: వైద్యారోగ్య శాఖ పరిధిలో నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ధనరాజ్‌ అన్నారు. సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గర్భి ణుల వివరాలు 12 వారాల్లో నమోదు చేయాలని సూచించారు. సమయానుసారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో క్షయ పరీక్షలు పెంచి వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి చికిత్స అందించాలని వివరించారు. కుష్ఠు వ్యాధి బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ఎండల తీవ్రత దష్ట్యా వడదెబ్బ తగలకుండా అవగా హన కల్పించాలని సూచించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ రాజేందర్‌, డాక్టర్‌ ఇధ్రిస్‌గౌరి, కార్యక్రమా నిర్వాణ అధికారులు డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ రాజారమేశ్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు

కై లాస్‌నగర్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్‌ సుభాష్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్‌మ్స్‌ (ఆధార్‌) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్‌ శ్యామ్‌లాల్‌నాయక్‌ నామినేషన్‌ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

నామినేషన్‌కు అభ్యర్థులు సిద్ధం

22న కాంగ్రెస్‌ అభ్యర్థి సుగుణ..

24న బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌..

ఇదేరోజూ బీజేపీ రెబెల్‌గా సోయం?

ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు

ముఖ్యనేతల రాకతోనైనా వీడేనా?

న్యూస్‌రీల్‌

1/4

2/4

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ధనరాజ్‌
3/4

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ధనరాజ్‌

4/4

Advertisement
Advertisement