దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం  | Sakshi
Sakshi News home page

దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం 

Published Sun, Feb 4 2024 5:45 AM

Call of YSRCP leaders in the siddam meeting - Sakshi

సాక్షి, భీమవరం: ‘రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే..   

జగన్‌ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి 
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు.

కానీ సీఎం జగన్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్‌ సుపరిపాలన వల్లే. – వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే

ఇక వార్‌ వన్‌ సైడే 
ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్‌. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్‌మెంట్‌ పేరు కూడా జగన్‌. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్‌ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్‌ వన్‌ సైడే. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే  

హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్‌ 
నమ్మకానికి మారుపేరు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్‌రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్‌ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్‌. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. – కేశినేని నాని, ఎంపీ  

జనం హృదయాల్లో జగన్‌ సుస్థిర స్థానం 
పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచి్చన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్‌ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే 

అబద్ధం అంటే చంద్రబాబు... జగన్‌ అంటే నిజం... 
ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యూడీíÙయరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్‌తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్‌ అనే బొండి ఇసుకతో, పవన్‌ కళ్యాణ్‌ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిరి్మంచిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు.  పేదవాడికి ఇంగ్లిష్‌ విద్య అందిస్తుంటే ఈ అబద్దపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్‌ అయితే, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం.  – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి  

జగనన్న పిలుపే ఒక ప్రభంజనం 
సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్‌. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్‌ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు.

బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్‌ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచి్చంది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు.  – పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement