హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా.. | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా..

Published Thu, Apr 25 2024 4:14 PM

Former minister Harish Rao challenged Revanth Reddy

చేయకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా.. 

ఆగస్ట్‌ 15 నాటికి రూ.39 వేల కోట్ల రుణమాఫీ చేయాలి 

రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌ అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం 

సంగారెడ్డి, ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఖమ్మం: ‘వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి.. మళ్లీ వచ్చే ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని రేవంత్‌రెడ్డి నయా నాటకం మొ­దలుపెట్టిండు. మిస్టర్‌ రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తారీఖులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్య­­­మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా? నువ్వు పార్టీ రద్దు చేసుకుంటవా అని రేవంత్‌రెడ్డి నన్ను అంటున్నడు. ఖమ్మం నుంచి మళ్లీ చెబుతు­న్నా. నేను సవాల్‌ను స్వీకరిస్తున్నా.

ఇచ్చిన మాట ప్రకారం వడ్డీతో సహా రూ.39వేల కోట్లు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ఈనెల 26న ఉదయం 10గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స­్తూపం వద్దకు వస్తా, నువ్వు రా. అక్కడ బాండ్‌ పేపర్‌పై రాసి ప్రమాణం చేయి. నువ్వు అమలు చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేస్తా. మళ్లీ పోటీ కూడా చేయను. అమ­లు చేయక­పోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.

బుధవారం సంగారెడ్డిలో జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, ఖ­మ్మంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అనంతరం హరీశ్‌­రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తీరు­ను  విమర్శించారు. ఇచ్చిన హామీలు అమ­లు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ గ్రాఫ్‌ పడిపోయిందని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యా­సం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డిది పూటకోసారి మాట మా­ర్చ­డం ఆయన నైజం అన్నారు. రేవంత్‌ తొండి రాజకీ­యం చేస్తున్నారన్నారు.

ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నానని సోనియా సంతకాలతో బాండు పేపర్లు రాయించి పంపిణీ చేశారని. రాహు­ల్, ప్రియాంకగాం«దీలతో ప్రకటన చేయించారని గు­ర్తు చేశారు. 120 రోజులు గడుస్తు­న్నా, హామీలు అమ­లు చేయకుండా ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మేలా లేక దేవుడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గార్యంటీల అమలుకు శాసనసభ తొలి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మడమ తిప్పారని, రూ.­2లక్షల రుణమాఫీకి   విధివిధానాలనే ఖరారు చేయలేదని, మరోమారు గడువు పెడు­తున్న  రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న సాయం 4 నెలలుగా ఇవ్వకుండా ఒక్కో మహిళకు రూ.పది వేల బాకీ పడ్డారని, కల్యాణలక్ష్మి లబి్ధదారులకు తులం బంగారం, రైతుభరోసా సాయం ఎకరానికి రూ.15 వేలు, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.4 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.  కాంగ్రెస్‌ పార్టీకి సీపీఎం, సీపీఐ ఎందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా పార్టీల నేతలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు.  

Advertisement
Advertisement