పెన్షన్ల పంపిణీని ఆపిన పాపం చంద్రబాబుదే: పేర్ని నాని | Sakshi
Sakshi News home page

పెన్షన్ల పంపిణీని ఆపిన పాపం చంద్రబాబుదే: పేర్ని నాని

Published Wed, Apr 3 2024 3:58 PM

Perni Nani Fires On Chandrababu TDP Over pensions Distribution - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు.

2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తము అడ్డుకోలేదన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. 

సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? ఇప్పుడేం మాట్లాడుతుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని.. ఇప్పుడు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు.  మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా  అని మండిపడ్డారు.
చదవండి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ

‘చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు. మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు?. పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు 
పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది?. ముసలివారి ఉసురు మీకు తగలదా?. వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా?. 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా?. 

58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం. 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్‌పై ప్రేమ తగ్గిపోతుందా?.వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా?  నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే’ అంటూ ఫైర్‌ అయ్యారు పేర్ని నాని

Advertisement
Advertisement