ఆదిబట్ల ‘హస్త’గతం | Sakshi
Sakshi News home page

ఆదిబట్ల ‘హస్త’గతం

Published Sun, Apr 7 2024 7:15 AM

చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న మర్రి నిరంజన్‌రెడ్డి  - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదిబట్ల మున్సిపాలిటీ హస్తగతమైంది. చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కమాండ్ల యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 3న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన 15 మంది కౌన్సిలర్లలో 13 మంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో విజయం సాధించారు. కొత్త చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా జాప్యం జరుగుతూ వచ్చింది. కోర్టు జోక్యంతో కలెక్టర్‌, ఎన్నిల కమిషన్‌ కదిలింది. ఈ క్రమంలో శనివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఎన్నికల అధికారిగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మహేందర్‌ ప్రతిపాదించగా, కుంట్ల మౌనిక బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా కమాండ్ల యాదగిరిని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ మర్రి అర్చన బలపర్చగా, నల్లబోలు లావణ్య బలపర్చారు. ఇద్దరినీ 13 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆర్డీఓ అనంతరెడ్డి వెల్లడించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికై న నిరంజన్‌రెడ్డి, కమాండ్ల యాదగిరితో ప్రమాణస్వీకారం చేయించారు. వైస్‌ చైర్మన్‌గా అవకాశం వస్తుందని భావించిన బీజేపీ కౌన్సిలర్‌ పొట్టి రాములు రాదని తెలియడంతో క్యాంపు నుంచే వెళ్లిపోయారు. సమావేశానికి రాదనుకున్న మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ కోరె కళమ్మ విచ్చేసి సంతకం చేశారు.

పార్టీశ్రేణుల సంబరాలు..

నూతన చైర్మన్‌గాఎన్నికై న మర్రి నిరంజన్‌రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముందుగా కమిషనర్‌ బాలకృష్ణ, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఏఈ వీరాంజనేయులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ ఖాతాలోకి మున్సిపాలిటీ

చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవం

వైస్‌ చైర్మన్‌గా కమాండ్ల యాదగిరి

సహకరించిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

గైర్హాజరైన బీజేపీ కౌన్సిలర్‌

Advertisement
Advertisement