Sakshi News home page

IPL 2024: షెడ్యూల్‌, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు

Published Wed, Mar 20 2024 1:59 PM

IPL 2024: 17 Days Schedule Full Squads Venues Timings All Details - Sakshi

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్‌ వేదికగా మార్చి 22న ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ మొదలుకానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోరుతో 2024 సీజన్‌కు తెరలేవనుంది.

ఇక దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్‌?.. వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం!

ఐపీఎల్‌-2024 తొలి దఫా షెడ్యూల్‌లో 21 మ్యాచ్‌లు.. ఏయే వేదికల్లో అంటే!‌ 
►మార్చి 22- చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే- CSK) వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై
►మార్చి 23- పంజాబ్‌ కింగ్స్‌(పీబీకేఎస్‌- PBKS)వర్సెస్‌  ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం)
►మార్చి 23- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) వర్సెస్‌  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)- కోల్‌కతా(రాత్రి)
►మార్చి 24- రాజస్తాన్‌ రాయల్స్‌(ఆర్‌ఆర్‌) వర్సెస్‌  లక్నో సూపర్‌ జెయింట్స్‌(ఎల్‌ఎస్‌జీ)- జైపూర్‌(మధ్యాహ్నం) 
►మార్చి 24- గుజరాత్‌ టైటాన్స్‌(జీటీ-GT) వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌(ఎంఐ- MI)- అహ్మదాబాద్‌(రాత్రి)

►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్‌ కింగ్స్‌- బెంగళూరు
►మార్చి 26- సీఎస్‌కే- గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై
►మార్చి 27- సన్‌రైజర్స్‌- ముంబై- హైదరాబాద్‌
►మార్చి 28- రాజస్తాన్‌- ఢిల్లీ- జైపూర్‌

►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్‌- బెంగళూరు
►మార్చి 30- లక్నో- పంజాబ్‌- లక్నోలో
►మార్చి 31- గుజరాత్‌- సన్‌రైజర్స్‌- అహ్మదాబాద్‌(మధ్యాహ్నం)
►మార్చి 31- ఢిల్లీ- సీఎస్‌కే- వైజాగ్‌

►ఏప్రిల్‌ 1- ముంబై- రాజస్తాన్‌- ముంబై
►ఏప్రిల్‌ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు
►ఏప్రిల్‌ 3- ఢిల్లీ- కేకేఆర్‌- వైజాగ్‌

►ఏప్రిల్‌ 4- గుజరాత్‌- పంజాబ్‌- అహ్మదాబాద్‌
►ఏప్రిల్‌ 5- సన్‌రైజర్స్‌- సీఎస్‌కే- హైదరాబాద్‌
►ఏప్రిల్‌ 6- రాజస్తాన్‌- ఆర్సీబీ- జైపూర్‌

►ఏప్రిల్‌ 7- ముంబై- ఢిల్లీ- ముంబై
►ఏప్రిల్‌ 7- లక్నో- గుజరాత్‌- లక్నో.

నోట్‌: మార్చి 23, 24, 31, ఏప్రిల్‌7న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు.. 
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్‌లు 7.30కి ఆరంభమవుతాయి.  స్టార్‌ స్పోర్ట్స్‌(టెలివిజన్‌), జియో సినిమా(డిజిటల్‌)లో ప్రత్యక్ష ప్రసారం.

ఐపీఎల్‌-2024 తొలి దఫా మ్యాచ్‌లు జరిగే వేదికలు
చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌, లక్నో, వైజాగ్‌, ముంబై. తొలి దఫా షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్‌ హోం గ్రౌండ్‌గా ఉంటుంది.

IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్: 
ఎంఎస్ ధోని (కెప్టెన్‌), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్‌, నిశాంత్‌ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 

►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ.

ముంబై ఇండియన్స్‌
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశాంక.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

కోల్‌కతా నైట్ రైడర్స్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్,  చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్.

గుజరాత్ టైటాన్స్
శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్.

లక్నో సూపర్ జెయింట్స్
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్‌, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్.

రాజస్థాన్ రాయల్స్
సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ.

ఢిల్లీ క్యాపిటల్స్ 
రిషబ్ పంత్ (కెప్టెన్‌), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్‌, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. 

►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్‌గిడి.

పంజాబ్ కింగ్స్ 
శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 
పాట్ కమిన్స్(కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్‌, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.

చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్‌గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా

Advertisement

What’s your opinion

Advertisement