ఇదెక్కడి ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! ప్ర‌పంచంలోనే | Sakshi
Sakshi News home page

#Jake Fraser McGurk: ఇదెక్కడి ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! ప్ర‌పంచంలోనే

Published Sat, Apr 27 2024 4:45 PM

Jake Fraser McGurk smashes 15-ball fifty against Mumbai Indians

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన మెక్‌గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ముంబై బౌలర్లను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు.

ఆఖరికి ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న మెక్‌గర్క్‌.. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 15 బంతుల లోపు  రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా మెక్‌గర్క్ నిలిచాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ మెక్‌గర్క్‌ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు.

దీంతో ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో మెక్‌గర్క్‌ కంటే ముందు వెస్టిండీస్‌ దిగ్గజాలు ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement