నిబంధన తుంగలో తొక్కిన పాక్‌ కెప్టెన్‌.. పీసీబీ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

Babar Azam: నిబంధన తుంగలో తొక్కిన పాక్‌ కెప్టెన్‌.. పీసీబీ సీరియస్‌

Published Fri, May 20 2022 12:52 PM

PCB Reacts Babar Azam Criticized After Brings Brother For-Net-Practice - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) నిబంధనలను తుంగలో తొక్కాడు. లాహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ అత్యంత మౌళిక సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ సెంటర్‌కు పీసీబీ అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్‌, జూనియర్‌ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. ఇటీవలే బాబర్‌ ఆజం తన సోదరుడు సఫీర్‌ ఆజంను ప్రాక్టీస్‌కు తీసుకొచ్చాడు.కాగా సఫీర్‌ ఆజం ఇంతవరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఆడలేదు.

తన సోదరుడితో నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేయించి శిక్షణలో మెళుకువలు ఇచ్చాడు. స్వయంగా తానే పరిశీలించిన బాబర్‌ బౌలింగ్‌ టెక్నిక్స్‌ వివరించాడు.ఈ తతంగాన్ని అంతా బాబర్‌ ఆజం సోదరుడు సఫీర్‌ ఆజం ట్విటర్లో షేర్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాబర్‌ ఆజం చేసిన పనిపై పీసీబీ కాస్త గుర్రుగానే ఉంది. నిబంధనలను అతిక్రమించిన బాబర్‌పై పీసీబీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

బాబర్‌ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడితో కలిసి క్యాంప్‌ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు. తాజాగా ఈ విషయం తెలియడం.. ఆపై ఏం చేయాలన్న దానిపై మాకు ఒక క్లారిటీ ఉంది అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.

చదవండి: Sourav Ganguly New House: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
 
Advertisement