సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!? | Sunil Narine Coaxed To Unretire And Play T20 World Cup For West Indies, See Details - Sakshi
Sakshi News home page

T20 World Cup: సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?

Published Thu, Apr 18 2024 6:01 PM

Sunil Narine coaxed to unretire and play T20 World Cup for West Indies - Sakshi

వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ సునీల్ న‌రైన్ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. న‌రైన్ త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనుక్కి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 నేప‌థ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు నరైన్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విండీస్ క్రికెట్‌తో పాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సైతం నరైన్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై విండీస్ క్రికెట్ నుంచి కానీ నరైన్ నుంచి కానీ ఇప్పటవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా నరైన్ ప్రస్తుతం ఐపీఎల్‌-2024 సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. ఆటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వస్తున్న నరైన్ ప్రత్యర్ధి జట్లపై విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు.

ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన నరైన్‌.. 276 పరుగులు చేశాడు. ఆటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడినిటీ20 వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌లో భాగం చేయాలని  విండీస్ క్రికెట్ ప్లాన్ చేస్తోంది. కాగా నరైన్ గతేడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు విండీస్ తరపున చివరి మ్యాచ్ 2019లో ఆడాడు.

Advertisement
Advertisement