IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..! | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..!

Published Thu, Mar 7 2024 6:25 PM

Sunrisers Hyderabad Have Unveiled Their New Kit For IPL 2024 - Sakshi

త్వరలో (మార్చి 22) ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీని ఇవాళ (మార్చి 7) విడుదల చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి జెర్సీ కొంచం కొత్తగా కనిపిస్తుంది. కొత్త జెర్సీతో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఫోటోలకు పోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్‌ చేస్తూ భువీ ఫోటోనే సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. హైదరాబాద్‌ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్‌ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది. సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌ చేయగలరు.

ఇదిలా ఉంటే, రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆరెంజ్‌ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌ ఇదివరకే విడుదలైంది. ఈ విడతలో సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ లోకల్‌ టీమ్‌ కేకేఆర్‌ను ఢీకొంటుంది.  మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్‌ టైటాన్స్‌తో, ఏప్రిల్‌ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్‌,  సీఎస్‌కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది.

కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్‌ యాజమాన్యం పాత కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ను తప్పించి పాట్‌ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్‌ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ టీమ్‌ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. 

సన్‌రైజర్స్‌ జట్టు వివరాలు..
అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు 
గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్‌)
భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు


 


 

Advertisement
Advertisement