వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం​ ఇద్దరితో పోటీపడుతున్న అక్షర్‌ పటేల్‌..! | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం​ ఇద్దరితో పోటీపడుతున్న అక్షర్‌ పటేల్‌..!

Published Thu, Apr 25 2024 6:52 PM

T20 World Cup 2024: Axar Patel Fighting With Ravi Bishnoi And Avesh Khan For One Spot In Indian Squad

టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్ల ప్రకటన కోసం మే 1 డెడ్‌లైన్‌ కావడంతో అన్ని దేశాల సెలెక్షన్‌ ప్యానెల్‌లు తమతమ జట్లను ఫైనల్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు కూడా తమ జట్టుకు తుది రూపు తెచ్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. టీమిండియా విషయంలో సెలెక్టర్లు ఇదివరకే ఓ అంచనాతో ఉన్నప్పటికీ ఒకట్రెండు బెర్తుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. 

హార్దిక్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌..?
ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబేల మధ్య పోటీ ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సెలెక్టర్లు పాండ్యావైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. శివమ్‌ దూబేకు ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాకపోవడం అతనికి మైనస్‌ అవుతుంది. దూబే బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా ఆల్‌రౌండర్‌ కోటా కాబట్టి సెలెక్టర్లు రెండు విభాగాలను పరిగణలోకి తీసుకుంటారు. హార్దిక్‌కు గత అనుభవం కూడా కలిసొస్తుంది. 

పంత్‌ ఫిక్స్‌.. సంజూ వర్సెస్‌ రాహుల్‌
రిషబ్‌ పంత్‌ టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్‌ 2024లో ప్రదర్శనల ఆధారంగా పంత్‌ ఎంపిక జరుగనున్నట్లు సమాచారం.సెకెండ్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌ తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. రాహుల్‌వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

అక్షర్‌ వర్సెస్‌ ఆవేశ్‌ వర్సెస్‌ బిష్ణోయ్‌
బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ బెర్త్‌లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఒక్క బెర్త్‌ విషయంలో సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలుపట్టుకున్నారు. వరల్డ్‌కప్‌ వేదికలు స్లో ట్రాక్స్‌ కావడంతో అక్షర్‌కు మెరుగైన అవకాశాలు ఉండచ్చు. 

Advertisement
Advertisement