న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం | Sakshi
Sakshi News home page

World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం

Published Wed, Nov 1 2023 9:16 PM

WC 2023: South Africa thrash New Zealand by 190 runs - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో దక్షిణాఫ్రికా జైత్ర యాత్ర కొనసాగుతోంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది.

సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ 4 వికెట్లతో చెలరేగగా.. జానెసన్‌ మూడు, కోయెట్జీ రెండు, రబాడ ఒక వికెట్‌ సాధించారు. కివీస్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(60) పరుగుతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. జట్టులో కేన్‌ విలియమ్సన్‌ లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ప్రోటీస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. డస్సెన్‌ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 పరుగులు చేయగా.. డికాక్‌ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. నీషమ్‌, బౌల్ట్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. ఇక మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ప్రోటీస్‌ 6 విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్ధానికి చేరుకుంది. 
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌..

Advertisement
Advertisement