కాంగ్రెస్‌లో భారీ నియామకాలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో భారీ నియామకాలు

Published Sun, Jan 18 2015 12:46 AM

కాంగ్రెస్‌లో భారీ నియామకాలు - Sakshi

  • జాబితాను విడుదల చేసిన ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
  • సాక్షి, హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధిష్టానం కొత్త నియామకాలు చేపట్టింది. ప్రధాన కార్యదర్శులుగా 26 మందికి, 12 జిల్లాలకు అధ్యక్షులనూ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరో 12 మంది నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీ ఆమోదించిన జాబితాను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి  శనివారం విడుదల చేశారు.
     
    ప్రధాన కార్యదర్శులు వీరే..

    కిల్లి రామ్మోహన్ రావు, యడ్ల రమణ మూర్తి, ద్రోణంరాజు శ్రీనివాసరావు, గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, పంతం నానాజి(వేంకటేశ్వరరావు), ఎస్.ఎన్.రాజ, మార్టిన్ లూథర్, ఎన్.రాజీవ్ రతన్, ఎన్.నరసింహారావు, ఆకుల శ్రీనివాసకుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, కె.రమాదేవి, వై.వేంకటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, సూరిబాబు, కాసు మహేశ్వరరెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావు, నేదురమల్లి రామ్ కుమార్‌రెడ్డి, పనబాక క్రిష్ణయ్య, నందిమండలం భాను శ్రీ, ఎ.సుజాతమ్మ, షహజాన్ బాష, వి.ఎస్.ఎస్.ఇందిర, ప్రభాకర్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.టి.సుబ్బిరామిరెడ్డిని కోశాధికారిగా నియమించారు.
     
    12 జిల్లాలకు కొత్త డీసీసీలు

    కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులుగా డి.జగన్‌మోహన్‌రావు(శ్రీకాకుళం), పి.విజయకుమార్(విజయనగరం), పసుపులేటి బాలరాజు(విశాఖపట్నం), కందుల దుర్గేష్(తూర్పు గోదావరి), రఫీహుల్లా బేగ్(పశ్చిమ గోదావరి), కడియాల బుచ్చిబాబు(కృష్ణా), ఎం.మల్లికార్జునరావు(గుంటూరు), ఎం.ఉగ్రనరసింహారెడ్డి(ప్రకాశం), బి.వై.రామయ్య(కర్నూలు), నజీర్ అహ్మద్(కడప), కోటా సత్యనారాయణ(అనంతపురం), కె.వేణుగోపాల్‌రెడ్డి(చిత్తూరు)లను నియమించారు.నెల్లూరుకు  ప్రస్తుత ఇన్‌చార్జి ధనుంజయరెడ్డిని కొనసాగించనున్నారు.
     
    సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు.: సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బెహరా భాస్కరరావు(విశాఖపట్నం), కంపర రమేష్(కాకినాడ), ఎన్.వి.శ్రీనివాస్(రాజమండ్రి), రాజనాల రామ్మోహనరావు(ఏలూరు), మల్లాది విష్ణువర్ధన్(విజయవాడ), ఎస్.కె.మస్తాన్ వలి(గుంటూరు), టి.శ్రీపతిప్రకాశ్(ఒంగోలు), ఎ.సి.సుబ్బారెడ్డి (నెల్లూరు), బండి జక్రయ్య(కడప), ఎం.సుధాకర బాబు(కర్నూలు), షాలి దాదా గాంధీ(అనంతపురం), ఎం.నరసింహులునాయుడు (చిత్తూరు)ను నియమించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement