
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల ఎంపిక లోనూ, అద్భుతమైన నటనలోనూ అతనికి అతనే సాటి. మూడు పదుల తన సినిమా కరియర్‌లో ఎన్నో క్లాస్, మాస్ సినిమాలను అందించడమే కాదు, అనేక అవార్దులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఫ్యామిలీ , పిల్లలు, ఇరా, జునైద్, ఆజాద్ పట్ల బాధ్యతగా ఉండే ఆమీర్ తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్‌లకు మంచి కుమారుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన తల్లి 90వ పుట్టిన రోజును అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి వార్త హల్‌చల్ చేస్తోంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, జూన్ 13, అమీర్ తల్లి జీనత్ హుస్సేన్ బర్త్‌డే. ఈ నేపథ్యంలో గ్రాండ్ పార్టీని ప్లాన్ చేశాడట. కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడిన 200 మందికి పైగా అతిథులతో గ్రాండ్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. ముంబై నివాసంలో ఈ పార్టీ జరగనుంది. బనారస్, బెంగళూరు, లక్నో, మైసూర్ తదితర నగరాల నుండి తరలి రానున్నారు.
2022లో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఈ క్రమంలో తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకుని, కోలుకున్న సందర్భంగా అందర్నీ కలిసేందుకు ఆమె పుట్టిన రోజుకంటే మంచి సందర్భం ఏముంటుందని భావించారట. కాగా గతంలో మదర్స్ డే సందర్భంగా తన తల్లిని బెస్ట్ మామ్ ఇన్‌ద వరల్డ్ అంటూ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు ఆమీర్.
Comments
Please login to add a commentAdd a comment