మస్త్‌ హ్యాపీ | Sakshi
Sakshi News home page

మస్త్‌ హ్యాపీ

Published Wed, Sep 26 2018 1:27 AM

Actress Rambha blessed with a baby boy - Sakshi

వెండితెరపై సెంచరీని ఎప్పుడో పూర్తి చేసిన అందాల తార రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఓన్లీ సౌత్‌లోనే కాదు, హిందీ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు రంభను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే... ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చారు. 2010లో కెనడాకి చెందిన ఇంద్రకుమార్‌ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు రంభ.  

ఈ  దంపతులకు ఆల్రెడీ లాణ్య, షాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ నెల 23న బేబీ బాయ్‌కి జన్మనిచ్చాను. పేరెంటింగ్‌ లైఫ్‌ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు రంభ. కాగా, 2007లో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసిన రంభ 2008లో కీలక పాత్ర చేసిన ‘దొంగ సచ్చి నోళ్లు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. బుల్లితెరపై మాత్రం కనిపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement