ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువ | Sakshi
Sakshi News home page

ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువ

Published Tue, Aug 5 2014 11:52 PM

ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువ

 టాలీవుడ్‌లో నెంబర్‌వన్ నాయికగా వెలుగొందుతున్న నటి సమంత. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆ స్థాయి కోసం ఆరాటపడుతున్నారు. ఆ మధ్య సినీ పరిశ్రమలో హీరోల ఆధిక్యం ఎక్కువంటూ నోరు జారి కొందరి ఆగ్రహానికి గురైన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తెలుగు చిత్ర ప్రచారం వ్యవహారంలో మహేష్‌బాబుపై నోరు పారేసుకుని ఆయన అభిమానుల కోపానికి బలయ్యారు. తాజాగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం అధికం అంటూ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదిలో గ్లామర్‌కు కాస్త దూరంగా ఉన్నా ఈ బ్యూటీ ప్రస్తుతం ధరించే దుస్తుల్లో సాధ్యమయినంత పొదుపు పాటిస్తూ విచ్చలవిడిగా అందాలారబోతతో రెచ్చిపోతున్నారు.
 
 కమర్షియల్ చిత్రాల్లో నటించడం బోరనిపించడంలేదా అన్న ప్రశ్నకు ఈ అమ్మడు బదులిస్తూ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం అధికం. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం అరుదనే చెప్పాలన్నారు. మహిళా ఇతి వృత్తంతో రూపొందే చిత్రాల్లో అలాంటి పాత్రల్ని ఆశించవచ్చన్నారు. కమర్షియల్ చిత్రాల్లో ప్రాముఖ్యతను ఆశించరాదన్నారు. హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటించే అవకాశాన్ని అందుకోకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు ఆ చిత్ర ఒరిజినల్ లోని ఫీల్‌ను రీమేక్‌లో తీసుకురాగలరా? అన్న సందేహంతోనే అవకాశాన్ని అందుకోలేదన్నారు.
 
 అయితే అలాంటి బలమయిన నాయిక పాత్ర లభిస్తే నటించడానికి రెడీ అన్నారు. ఇకపోతే మీ పెళ్లెప్పుడు? ప్రియుడి గురించి చెప్పండి అని కొందరడుగుతున్న ప్రశ్నలు వేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఆడది అనగానే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అరుుపోవాలని అనే సమాజం భావిస్తోందన్నారు. పెళ్లి కంటే కూడా జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. పురుషులకే సాధ్యం అనే భావనలో మార్పు రావాలని సమంత పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement