మరో సీనియర్‌ సినీజంట విడిపోయింది! | Sakshi
Sakshi News home page

మరో సీనియర్‌ సినీజంట విడిపోయింది!

Published Sat, May 27 2017 10:58 AM

మరో సీనియర్‌ సినీజంట విడిపోయింది!

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించారు. తాము విడిపోతున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 'ఒకరి పట్ల ఒకరికి అపారమైన ప్రేమ, గౌరవం ఉండటం వల్ల మేం 18 ఏళ్ల పాటు కలిసి జీవించాం. ఇప్పడు మేం విడిపోవాలని నిర్ణయించాం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మా పిల్లలను పెంచుతూ.. సన్నిహిత స్నేహితులుగా కొనసాగలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీని మీడియా గౌరవించాలని కోరుతున్నాం' అని ఈ జంట ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.

హాలీవుడ్‌ మూవీ 'జూలాండర్‌' సినిమాతో బెన్‌ స్టిల్లర్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. 1995లో వచ్చిన ‘ద బ్రాడీ బంచ్‌’  చిత్రంలో టీనేజ్‌ కూతురి పాత్రతో క్రిస్టిన్‌ టేలర్‌ పేరు సంపాదించుకుంది. బేన్‌‌-టేలర్‌ జోడీ ట్రోపిక్‌ థండర్‌, మీట్‌ ద పేరెంట్స్‌ వంటి పలు హాలీవుడ్‌ చిత్రాల్లో కలిసి నటించింది. వీరికి 2000 సంవత్సరంలో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement