-
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్‌లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్‌ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు. -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
ఛాయ్ పే శ్రీవల్లి.. బేగంపేటలో రష్మిక సందడి (ఫొటోలు)
-
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదలైంది. అందులో ఆమె లుక్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!
Advertisement