-
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్‌పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.రేవంత్, రాహుల్ ట్యాక్స్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది. భారత్ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది
కరీంనగర్ టౌన్: ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలారా.. నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి’అంటూ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నరేంద్రమోదీ, రాహుల్‌గాం దీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. పదేళ్ల ఎన్డీఏ పాలన, అంతకుముందు పదేళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామాఆర్టిస్ట్, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్.. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, 2జీ, బొగ్గు, విమానాలు, కామన్వెల్త్ గేమ్, ఆదర్శ స్కాంలు.. ఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్ఐ, హవాలా చివరకు చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీ ఏర్పాటు)లో వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపారులను సంకలో వేసుకొని తిరిగిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. కానీ మోదీ మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని వివరించారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని, తర్వాత 9 గంటలకు వేములవాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారని, సభను విజయవంతం చేయాలని కోరారు. -
నేడు వేములవాడకు మోదీ!
సాక్షి, హైదరాబాద్/ వేములవాడ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడంతోపాటు వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. సుమారు 8 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు.అక్కడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వేములవాడలోని బాలానగర్‌లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.పకడ్బందీగా ఏర్పాట్లు..వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వాటిని సరిచేస్తున్నారు. వానలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో.. బుధవారం సభ నిర్వహణ ఎలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం.అమిత్ షా, రాజ్‌నాథ్‌ల ప్రచారం కూడా..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా.. గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో భువనగిరికి చేరుకుని, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్‌లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.పీవీ కుటుంబ సభ్యులతో మోదీ డిన్నర్రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తెలు ఎమ్మెల్సీ వాణీదేవి, శారదాంబ, ఇతర కుటుంబ సభ్యులు రాజ్‌భవన్‌కు వచ్చి ప్రధాని మోదీని కలిశారు. మోదీ వారితో కాసేపు మాట్లాడారు, కలిసి డిన్నర్ చేశారు. అనంతరం పీవీ మనవడు ఎన్వీ సుభాష్ మాట్లాడారు. ప్రధానిని కలిసి, అరగంటకుపైగా గడపడం.. సైన్స్, టెక్నాలజీ, ఇతర అంశాలపై మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. -
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
బీజేపీని ఓడించడమే లక్ష్యం
కరీంనగర్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా సీపీఐ ముఖ్య నాయకులతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. అబద్ధాలకోరు నరేంద్రమోదీ అని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సూచించారు. ప్రధాని మోదీ తనకు కుటుంబమే లేదంటాడు కానీ ఆయనకు 29మంది దత్త పుత్రులు ఉన్నారని, వారంతా గుజరాత్ బ్యాంకుల్లో లక్షల కోట్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని విమర్శించారు. పదేళ్లల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆటకెక్కించి, హమీలను అమలు చేయకుండా ఆయోధ్య పేరుతో రాముడి పేరుచెప్పి ఓట్లు దండుకునే కుట్రను ప్రజలు గ్రహించారని ధ్వజమెత్తారు. ప్రధానిగా ఉంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేస్తామనడం ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతమని అన్నారు. గంజాయి స్మగ్లరైన అదానీ నేడు కోట్లకు ఎలా అధిపతి అయ్యాడని విమర్శించారు. నరేంద్ర మోదీకి వివాహవ్యవస్థపై గౌరవం లేదని, తాళి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయలేని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ని ఓడించి సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చురుగ్గా వ్యవహరించిన బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఎందుకు ఆ పదవి నుంచి దించిందో అందరికీ తెలుసన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్, కర్రె భిక్షపతి, గుంటి వేణు, వెన్న సురేశ్, తాండ్ర సదానందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, గడిపే మల్లేశ్, ఆదరి శ్రీనివాస్, కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించండి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement