డోలీ కష్టాలు లేనట్టే.. | Sakshi
Sakshi News home page

డోలీ కష్టాలు లేనట్టే..

Published Wed, May 8 2024 9:15 AM

డోలీ

ఒకప్పుడు గిరి శిఖరంలో ఉన్న

ఆ గ్రామాలకు దట్టమైన అటవీ

ప్రాంతంలో కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా

మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.9.17 కోట్లతో చేపట్టిన రింగ్‌ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

కొద్దిరోజుల్లో వినియోగంలోకి

రానుండటంతో లంగుపర్తి

పంచాయతీలోని తొమ్మిది గ్రామాల గిరిజనుల్లో ఆనందం నెలకొంది.

అనంతగిరి: మండలంలోని లంగుపర్తి పంచాయతీ పరిధిలోని రాళ్లవలస, కరకవలస, కుంభర్తి, దింశవలస, చీడివలస, ఎగువపట్టి, దిగువపట్టి, ఎగువపాడు లంగుపర్తి గ్రామాలు కొండల మీద ఉన్నాయి. ఇవి మండల కేంద్రానికి పంచాయతీ కేంద్రమైన లంగపర్తి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఈ పంచాయతీ పరిధిలో శివారు గ్రామాలన్నీ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండల మీద ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లాలి.

రూ.7 కోట్లతో రోడ్డు నిర్మాణం..

అత్యవసర పరిస్థితుల్లో డోలీలపై ఆధారపడాల్సిందే. వీరి సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రధా నమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకంలో గిరి శిఖర గ్రామాలకు 10.5 కిలోమీటర్ల మేర రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇదే మార్గంలోని లుంగపర్తి గెడ్డపై 2.17 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్‌ ప్రాజెక్ట్స్‌ అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కానుండటంతో తొమ్మిది గిరి శిఖర గ్రామాల పరిధిలోని సుమారు 15వేల మంది గిరిజనుల్లో ఆనందం నెలకొంది.

నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం

రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల కిత్రం నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే పనులు ప్రారంభించాం. నాణ్యత ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే శిఖర గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పనున్నాయి.

– విజయ్‌, ఏఈ, పీఆర్‌ ప్రాజెక్ట్స్‌

లంగుపర్తి సమీపంలోని గెడ్డపై రూ.2.17 కోట్లతో నిర్మించిన వంతెన

లంగుపర్తి పంచాయతీ కొండల్లోని

గ్రామాలకు రింగ్‌ రోడ్డు సౌకర్యం

రూ.9.7 కోట్లతో నిర్మాణం

చివర దశలో పనులు

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు

మంజూరు

15 వేల మంది జనాభాకు

తప్పనున్న అవస్థలు

మేలు చేసిన ప్రభుత్వం

రోడ్డు లేకపోవడం వల్ల శివారు గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలమీదకు వస్తే డోలీలో మోసు కుని రావాల్సిందే. ప్రభుత్వం చొరవతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తమ పంచాయతీలోని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. మేమంతా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.

– జన్ని సన్యాసిరావు, సర్పంచ్‌, లంగుపర్తి

డోలీ కష్టాలు లేనట్టే..
1/3

డోలీ కష్టాలు లేనట్టే..

డోలీ కష్టాలు లేనట్టే..
2/3

డోలీ కష్టాలు లేనట్టే..

డోలీ కష్టాలు లేనట్టే..
3/3

డోలీ కష్టాలు లేనట్టే..

Advertisement
Advertisement