ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.
సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.
కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.
అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment