గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు

Published Sat, Feb 10 2024 5:22 AM

Adjustment of employees in village and ward secretariats - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు  సచి­వాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచి­వాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేష­నలైజేషన్‌ (సర్దుబాటు)కు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 15,004  గ్రామ, వార్డు స­చి­వా­ల­యాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యో­గు­లు­న్నా­రు. ప్రస్తుతం దాదాపు 7,900 సచి­వాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సు­మారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దు­బాటు చేయనున్నారు.

8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బ­దిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ çసుమారు 5,000 మందికి స్థా­నచ­లనం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాల ప్రా­తిప­దికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జ­రు­గు­తుందని తెలిపారు. ఏ జిల్లాలోని వారికి ఆ జి­ల్లా­లో­నే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముం­దే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్ర­­క్రియ పూర్తవుతుందని అధి­కా­రు­లు వెల్లడించారు.

విధివిధానాలివీ..
♦ ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు
♦ జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు
♦ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ
♦ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే,  వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు.
♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది.
♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్‌ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. 
♦ వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి.
♦ ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్‌ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు

Advertisement
Advertisement