జహీరాబాద్,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ వ్యవస్థకు షాక్ ఇవ్వకపోతే రానున్న ఐదేళ్లలో తెలంగాణ మరింత పతనమవుతుందని హెచ్చరించారు. జహీరాబాద్‌లో మంగళవారం(ఏప్రిల్30) జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ మాట్లాడారు.
‘తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్‌హిట్ సినిమా ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోంది. డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ సొమ్ము ఢిల్లీకి చేరుతోంది.
ప్రజలు భవిష్యత్ కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను విధిస్తారు. మీ సందపదలో 50 శాతం కాంగ్రెస్ కాజేస్తుంది. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ చాలా మాట్లాడింది. అధికారంలోకి వచ్చి మౌనంగా ఉంటోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే’అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment