ప్రగతి గోదావరి | Sakshi
Sakshi News home page

ప్రగతి గోదావరి

Published Fri, Apr 19 2024 4:31 AM

Medical Colleges in Eluru and Palakollu: Andhra pradesh - Sakshi

వృద్ధిబాటన ‘ఉమ్మడి పశ్చిమ’ పరవళ్లు  

నరసాపురంలో ఆక్వా వర్సిటీ నిర్మాణం 

ఏలూరు,  పాలకొల్లుల్లో మెడికల్‌ కళాశాలలు

గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు పనులు  

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్‌ కళాశాలలు, ఫిషింగ్‌ హార్బర్, వాటర్‌గ్రిడ్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. 

ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ 
తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్‌ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్‌ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు  
పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్‌ వే గేట్ల నిర్మాణం, స్పిల్‌ చానల్‌ ఎగువ, దిగువ డ్యాంలు,  2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్‌షిప్‌ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు.  

ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు.  
► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

తమ్మిలేరుకు ‘వాల్‌’జడ 
ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్‌ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు.   

ఇతర అభివృద్ధి పనులు  
► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు టెండర్‌ దశకు చేరుకున్నాయి.  
► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.  
► యనమదుర్రు డ్రెయిన్‌పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి.  
► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్‌హెచ్‌ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు.   

Advertisement
Advertisement