సాక్షి, తిరుపతి: తిరుమలలో వర్షం కురిసి చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపుతుంటే వరుణ దేవుడు వర్షంతో భక్తులను చల్లర్చారు. తిరుమలలో మధ్యాహ్నం దాదాపు గంటలపాటు వర్షం కురిసింది. వేసవిలో ఎండలు మండిపోతుంటే నేడు కురిసిన వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
గంటపాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు కూల్ అయ్యారు. తిరుమల కొండపైనే కాకుండా ఘాట్ రోడ్డు మొత్తం వర్షం పడటం విశేషం. దీంతో కొండ ఎక్కే వారు.. కొండ దిగేవారు వర్షంతో.. చల్లటి వాతావరణంతో సేదతీరారు. చాలా మంది భక్తులు వర్షంతో తడుస్తూ గంతులు వేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కొండ కింద తిరుపతిలో మాత్రం వర్షం లేదు.. కేవలం తిరుమల కొండల్లోనే వర్షం పడింది.
కాగా, ఏపీలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment