తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది.
తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది. ఉదయం 10.30 గంటల తర్వాత వర్షం ప్రారంభం కాగా గంట తర్వాత కాస్త ఉధృతి తగ్గింది. దీంతో భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అన్నమయ్య భవన్‌లో డైలీ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా భక్తుల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదు అందాయి. ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 8.30గంటల నుంచి గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.